bye bye ys jagan common man sloganగత ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరుపున ప్రచారం చేసిన వైస్ షర్మిల ‘బాయ్…బాయ్ బాబు’ స్లోగన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లారు. “కుడి -ఎడమైతే” అన్నట్లుగా ఇపుడు ఇదే మాదిరి స్లోగన్ ఏపీలో ప్రచారంలో ఉంది. అదే “బాయ్…బాయ్ జగన్” అయితే ఇది ప్రజల్లోకి తీసుకెళ్లిన స్లోగన్ కాదు., ప్రజల నుండి పుట్టిన స్లోగన్.

వైసీపీ అధికారంలోకి అడుగు పెట్టిన రోజునుండి జగన్ అనుసరిస్తున్న విధానాలతో విసిగిపోయిన ప్రజలు వారి ఆగ్రహావేశాలను ప్రభుత్వానికి ఈ స్లోగన్ ద్వారా తెలియచేయాలి అని భావిస్తున్నారేమో అంటూ ప్రతిపక్ష పార్టీలు ఈ బాయ్ బాయ్ జగన్ నినాదాన్ని వైరల్ చేసున్నారు.

జగన్ అధికారంలోకి రాగానే ప్రజల ఆస్తులను కూల్చివేసి ‘ప్రజా ధనానికి’ బాయ్ – బాయ్ చెప్పారంటూ జగన్ రాష్ట్రాన్ని చెప్పిన ‘గుడ్ బాయ్’ ల చరిత్రను తవ్వి తీస్తున్నారు టీడీపీ నేతలు. రాజధానికి బాయ్.,పరిశ్రమలకు బాయ్., కరెంటుకు బాయ్., నిరుద్యోగుల ఆశలకు బాయ్ అంటూ సోషల్ మీడియాలో వార్ షురూ చేశారు ఏపీ యువత.

హిందూ దేవాలయాలకు బాయ్., తెలుగు భాషకు బాయ్.,సంస్కారానికి బాయ్., సంప్రదాయానికి బాయ్., వ్యాపారులకు బాయ్., విద్యాసంస్థలకు బాయ్., సంక్షేమానికి బాయ్., అభివృద్ధికి బాయ్., అన్న క్యాంటీన్లకు బాయ్., న్యాయస్థానాల తీర్పులకు బాయ్.,పోలవరంకు బాయ్.,చివరకు తన మంత్రి వర్గం కు కూడా బాయ్ చెప్పేసారు జగన్ అంటూ,జగన్ చెప్పిన బాయ్ లా చరిత్రను కథలుగా చెప్పుకుంటున్నారు ఏపి ప్రజానీకం.

రాష్ట్రంలో ఇంతమందికి బాయ్ చెప్పిన జగన్ రాష్ట్ర విధ్వంసానికి నిలువెత్తు రూపంలా మారారని అందుకే ప్రజలు తమ మనసు మార్చుకున్నారంటూ ట్రెండింగ్లో ఉన్న ఈ బాయ్ – బాయ్ జగన్ స్లోగన్ ను ప్రతిపక్ష పార్టీలు కూడా అందుకుంటున్నాయి. రానున్న ఎన్నికలలో రాష్ట్ర ప్రజలంతా కలిసి జగన్ సర్కార్కు బాయ్ – బాయ్ చెప్పే సమయం వస్తుందని అంతవరకూ ప్రజలు ఓపికతో.,సహనముతో ఉండాలంటూ విపక్షాలు విన్నవించుకుంటున్నాయి.

మొత్తానికి “ఇంటి ఆడపిల్ల ఉసురు ఊరికే పోదు” అనే సామెత జగన్ కు చుట్టుకున్నట్లుంది అంటున్నారు సీనియర్ సిటిజన్లు. అప్పుడు చెల్లి షర్మిల నోట వచ్చిన మాటే., ఇప్పుడు పేరు మార్చుకుని ‘మారీచుడిలా’ మారి ప్రజల నోట పలికింది అంటూ., ఇప్పుడు వైసీపీ నేతలకు కూడా అర్ధమయి ఉంటుంది ‘మారీచుడు’ ఎవరో అంటు జగన్ మాటల దాడికి ప్రతి దాడి చేస్తున్నారు టీడీపీ నేతలు.