By polls may problem to pawan kalyan janaseanవైఎస్సాఆర్ కాంగ్రెస్ కు చెందిన అయిదుగురు ఎంపీలు రాజీనామాలు చేశారు. ఈ నెలలోనే వారి రాజీనామాలు ఆమోదింపబడతాయి అని అందరు భావిస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ఒక ఏడాది లోపే సమయం ఉండటంతో ఉపఎన్నికలు వస్తాయా లేదా అనేది చూడాలి. ఉపఎన్నికలుంటూ వస్తే పోటీ ఖాయం అని టీడీపీ ఇప్పటికే తేల్చి చెప్పింది.

ఇప్పుడు అందరి దృష్టి పవన్ కళ్యాణ్ జనసేన మొట్టమొదటి సరిగా పోటీ చేస్తుందా లేదా అనేదాని మీదే ఉంది. అయితే ఈ ఉపఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేన్నట్టు జనసేనలోని మా వర్గాలు చెబుతున్నాయి. ఒక ఎంపీ స్థానంలో పోటీ చెయ్యడం అంటే అంత తేలికేమి కాదు. ఐదు ఎంపీ సెగ్మెంట్లు అంటే దాదాపుగా 30-35 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓటర్లు తీర్పు చెప్పబోతున్నారు.

ఇప్పటికిప్పుడు జనసేనకు అన్ని స్థానాలలో అభ్యర్థులు లేరు అదే విధంగా స్థానిక నాయకత్వమూ లేదు. పైగా ఈ స్థానాలు అన్నీ రాయలసీమ పరిసర ప్రాంతాలలో ఉన్నవి. అక్కడ వైకాపా ప్రాభల్యం ఎక్కువ. అదే విధంగా అక్కడ జనసేన చాలా బలహీనంగా ఉంది. ఇటువంటి సందర్భంలో పోటీ చేసి ఓడిపోతే 2019 ఎన్నికలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి.

కాబట్టి ప్రత్యేక హోదా కు మద్దతు అనే పేరుతో మొత్తానికి ఈ ఎన్నికలలో పోటీ చెయ్యకుండా ఉంటే మేలు అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు సమాచారం. అలా చేసిన విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో అసలు ఉపఎన్నికలు రాకపోతే మేలు అని జనసేన కోరుకుంటుందంట. చూడాలి మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందో?