Ravi Kakarala
Home Telugu ‘డ్రగ్స్’ కేసులో ‘దగ్గుపాటి’ అండ్ ‘అల్లు’ సభ్యులు?

‘డ్రగ్స్’ కేసులో ‘దగ్గుపాటి’ అండ్ ‘అల్లు’ సభ్యులు?

buzz Puri jagannath responds on drugs caseటాలీవుడ్ లో ప్రకంపనలు రేపిన డ్రగ్స్ వ్యవహారంలో బయటకు వచ్చిన సెలబ్రిటీల పేర్లల్లో ఎక్కువ మంది దర్శకుడు పూరీ జగన్నాధ్ అడ్డాకు చెందిన వ్యక్తులు కావడం గమనార్హం. మొత్తం 12 మంది సెలబ్రిటీలు ఉన్నారని స్వయంగా పోలీసు అధికారులు చెప్పగా, మరి ఏడెనిమిది మంది పేర్లు మాత్రమే ఎందుకు బయటకు వచ్చాయి? మిగిలిన వారెవరు? వారి పేర్లు ఎందుకు బయటకు రాలేదు? ఎక్సైజ్ అధికారులు వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఇలాంటి అనేక ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానం లభించడం లేదు.

అయితే ఇక్కడే దర్శకుడు పూరీ తెరపైకి వచ్చారు. డ్రగ్స్ కేసులో పూరీ వ్యవహారంపై నిజానిజాలు తెలుసుకునేందుకు ఓ మీడియా ఛానల్ సంప్రదించగా, అందులో భాగంగా పూరీ సంచలన విషయాలు బయట పెట్టారంటూ ఫేస్ బుక్, ట్విట్టర్ల వేదికగా సర్క్యూలేట్ అవుతున్న అంశం. ఈ కేసులో తన వర్గానికి చెందిన వారి పేర్లే ఎందుకు బయటకు వచ్చాయని ప్రశ్నిస్తూ… ఆ మిగతా వారి పేర్లు చెప్తే ప్రసారం చేసే దమ్ము మీకుందా? అంటూ మీడియా ప్రతినిధిని పూరీ ప్రశ్నించినట్లుగా ఇందులో తెలుస్తోంది.

మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్, దగ్గుపాటి సురేష్ బాబు రెండవ తనయుడు అభిరాం, అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీలు ఉన్నారని, వారికి కూడా నోటీసులు ఇచ్చారని, మరి వారి పేర్లు ఎందుకు మీడియాలో రావడం లేదంటూ పూరీ ప్రశ్నించే సరికి సదరు మీడియా వర్గాలు అవాక్కవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నట్లుగా ప్రచారం అవుతున్న ఉదంతంలో వాస్తవం ఎంత ఉందో తెలియాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూరీ ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల నుండి అయితే ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

పూరీ ఖాతాల నుండి వెలువడకపోయినా, సోషల్ మీడియా వేదికగా పూరీ ఈ ముగ్గురి పేర్లు చెప్పినట్లుగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరే అంశం ఏమిటంటే… దగ్గుపాటి సురేష్ బాబు, అల్లు అరవింద్ ల ప్రెస్ మీట్. బహుశా దానిని వేదికగా చేసుకుని ఈ కధ అల్లారో లేక పూరీ నిజంగానే ఈ ‘బిగ్ షాట్స్’ చెప్పారో తెలియాలంటే పూరీ పెదవి విప్పాల్సిందే. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయిన వృతికా శేరు ఆత్మహత్య, అక్కినేని అఖిల్ పెళ్లి, నాగార్జున వైసీపీలో చేరే విషయాలు పక్కా ఫేక్ అని తేలిన నేపధ్యంలో… పూరీ పేరుతో సర్క్యూలేట్ అవుతోన్న దీనిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

Galleries

Anushka Sharma Filmfare Magazine Shoot Photos
Neha Dhupia Instagram photos
Kajol, Dhanush VIP 2 Movie Press Meet Photos

Facebook Comments

< Another Disaster for Young Her...
Top Hero Says It’s Their... >