mudragada padmanabhamవచ్చే ఎన్నికలలో కాపులు ఎవరికీ మద్దతు ఇవ్వాలి అనే దానిపై పదమూడు జిల్లాల కాపు జేఏసీలు తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడుతానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తెలుగుదేశం పార్టీ కాపుల రిజర్వేషన్ పై హామీ ఇచ్చినా, కేంద్రంలో పరిదిలో ఉందని తేల్చిందని, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా కేంద్రం చేతిలో ఉందని చెబుతున్నారని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తామంటోందని, 9వ షెడ్యూలులో కాపు రిజర్వేషన్ల బిల్లు పెట్టేలా కృషి చేసి బీసీలకు ఇబ్బంది కలగకుండా కాపులకు న్యాయం చేసేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారని ఈ సంధర్భంగా ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో గానీ కేంద్రంలో గానీ వచ్చే అవకాశం లేదు గనుక ముద్రగడ జనసేన వైపు వెళ్ళొచ్చు.

పైగా జనసేనకు మద్దతు ఇవ్వలేని ఆ సామాజిక వర్గం నుండి ముద్రగడపై ఒత్తిడి ఎక్కువగా ఉందని సమాచారం. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కాపు పెద్దలతో సమావేశం పూర్తయ్యింది. మిగిలిన జిల్లాల సమావేశాల తరువాత దీనిపై ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందట.