buzz-eesha-rebba-in-rajamouli-rrr-movieఈషా రెబ్బా…టాలీవుడ్ లో ఇప్పుడెప్పుడే చిన్న చిన్న పాత్రలు చేస్తూ టాలీవుడ్ టాప్ హీరోయిన గా మారడానికి బాటలు వేసుకుంటున్న అందాల భామ. అయితే అరవింద సమేతా సినిమాలో ఎన్టీఆర్ తో నటించే అవకాశం అయితే ఇచ్చాడు కానీ త్రివిక్రమ్ పాపం ఆ పాపకు డైలాగ్స్ రాయడం మరచిపోయినట్లు ఉన్నాడు. ఇక మరో పక్క తాజాగా రిలీజ్ అయిన సుబ్రహ్మణ్యపురంలో కూడా ఈ భామ ఫుల్ లెంత్ పాత్రలో కనిపించింది కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడం ఒక ఎత్తు అయితే, ఈ సినిమాలో ఆమె పాత్రకి పెద్దగా పస లేకపోవడం మరో ఎత్తు.

ఈ కధ మొత్తం పక్కన పెట్టేస్తే తాజాగా టాలీవుడ్ లో ఒక మ్యాటర్ బలంగా వినిపిస్తుంది అది ఏంటి అంటే, ఈషా రెబ్బాకి రాజమౌళి తన టాలీవుడ్ మల్టీ స్టారర్ “ఆర్.ఆర్.ఆర్”లో అవకాశం ఇచ్చాడు అని, అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో ఆమె నటిస్తుంది అని. ఇక ఈ విషయంపై ఈషా కూడా స్పదించింది. అదంతా అబద్దం అని, అసలు నన్ను ఆర్.ఆర్.ఆర్ టీమ్ నుంచి ఎవ్వరూ అడగలేదు అని, కానీ ఈ అబద్డమే నిజం అయితేఎంత బావుంటుందో అని, ఎందుకంటే ఆ సినిమాలో అవకాశం దొరికితే తన కరియర్ పూర్తిగా మారిపోతుంది అని, మరో పక్క ఎన్టీఆర్, చెర్రీ లాంటి బడా హీరోలతో నటించే అవకాశం లభిస్తుంది అని ఈషా చెబుతుంది.

ఇక అరవింద సమేతాలో కూడా పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రే అని ముందే తెలిసినా ఎన్టీఆర్ తో కలసి నటించే అవకాశం కోసం, మరో పక్క త్రివిక్రమ్ లాంటి బడా దర్శకుల సినిమాలో యాక్ట్ చెయ్యడం కోసం ఒప్పుకున్నాను అని చెబుతుంది ఈ అమ్మడు. మరి ఆ అబద్దం నిజం అవుతుందో లేక అబద్దంగానే మిగిలిపోతుందో చూడాలి.