Buyers blindly going with NTR Biopic and Vinaya Vidheya Ramaమార్కెట్…ట్రెండ్ పేరు చెప్పి…బయ్యర్స్ తిప్పలు కొని తెచ్చుకుంటున్నారు. ఒక్క సినిమా హిట్ అయినంత మాత్రం సినిమా రేంజ్ ఏంటో తెలుసుకోకుండా భారీ రేట్లకు కొని చేతులు కాల్చుకుంటున్నారు. అయితే సినిమా దర్శకుడు..హీరో ఇద్దరూ టాప్ పోసిషన్ లో ఉంటే మాత్రం పరిస్థితులు కూడా సహకరించాలి కదా..మరి అవి సహకరించక పోతే చివరకు నష్టాలు తప్పవు అని స్పష్టంగా చెప్పవచ్చు..

అంతెందుకు తాజగా రోబో 2 .0 నే తీసుకోండి దాదాపుగా 70 కోట్లకు పైగానే తెలుగులో ఈ సినిమా రిలీజ్ చేశారు…కట్ చేస్తే సినిమా మంచి టాక్ వచ్చినా…లాంగ్ రన్ లో నిర్మాతలకు బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అంటూ ఒప్పుకోక తప్పని నిజం. అంతెందుకు తాజాగా చెర్రీ వినయ విధేయ రామా కూడా అదే తీరు…ఏకంగా 72 కోట్లకు కొన్నారట ఈ సినిమాని అయితే ట్రైలర్ చూసాక ఈ సినిమా తేడాగా ఉంది అన్న అనుమానాలతో మరో స్పైసి…ట్రైలర్ ని విడుదల చెయ్యమని బయ్యర్స్..దర్శకుణ్ణి..హీరోను పడే పడే అడుగుతున్నారట…

ఇక బాలయ్య ఎన్ఠీఆర్ బయోపిక్ కూడా 75 కోట్ల బిజినెస్ చేసింది..బాలయ్య కెరీర్ లో ఇదే టాప్…మరి 40 నుంచి 50 కోట్ల మార్కెట్ ఉన్న బాలయ్య సినిమాకి 75 కోట్ల బిజినెస్ అంటే రేపు ఏమాత్రం తేడా వచ్చినా బయ్యర్స్ కి ఎంత ఇబ్బంది?

ఇవేమి ఆలోచించకుండా బయ్యర్స్, సినిమాపై క్రేజ్, లేక హీరో అండ్ దర్శకుడి హిట్ రేషియో…మార్కెట్..ట్రెండ్ అన్నీ కలిపి కోట్లాది కోట్లు పోసి సినిమాలు కొని…చివరకు చిల్లర ఏరుకుంటున్నారు…మరి ఇప్పటికైనా బయ్యర్స్ సినిమాల విషయంలో జాగ్రత్త పడతారో లేదో..చూడాలి.