Butta Renuka Joining TDPకర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెదేపాలో జాయిన్ కావడం దాదాపు ఖాయం అయ్యీపోయింది . ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు ఆమె ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఇటీవలే వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు ఎంపీ రేణుకతో పాటు, అదే జిల్లాకు చెందిన మరో ముగ్గురు తమ పార్టీ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు పిలిపించుకుని మాట్లాడారు.

ఆ భేటీలో కర్నూలు లోక్‌సభ టికెట్‌ తనకే ఖరారు చేయాలని రేణుక కోరగా స్పష్టత ఇవ్వకుండా బీసీలకే టికెట్‌ ఇద్దామనుకుంటున్నాం కదా, మీరే ఉన్నారు కదా! అని మాత్రమే జగన్‌ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అలాగే పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చును స్వయంగా భరించే పరిస్థితిలో ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది.

ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తాను ఎన్నికల ఖర్చును భరించే పరిస్థితిలో లేనట్లు జగన్‌ దృష్టికి తీసుకువెళ్లగా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆమెకు ఆయన సూచించారు. శనివారం నాడు బుట్టా రేణుక సాక్షిలో ‘బేరం కుదిరింది’ అనే పేరుతో బుట్టా రేణుక పార్టీ వీడనున్నట్లు ఒక ఐటమ్ వచ్చింది.

అందులో కాంట్రాక్టులకోసం బుట్టా తెదేపాలో చేరడానికి సిద్ధం ఐనట్టు అప్పుడే బేరం కూడా కుదిరినట్టు సాక్షి రాసింది. పొమ్మనలేక పొగబెడుతున్నారేమో అనే అనుమానాలను ఆమె వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు. ఆమె తెదేపాలో జాయిన్ కావడం కాన్ఫర్మ్ ఐతే జగన్ మీద ఒక విస్పోటన ప్రెస్ మీట్ పెట్టడం ఖాయం అని రాజకీయ వర్గాల భోగోట్టా!

2013 లో 15 కోట్లు పార్టీ ఫండ్ పేరుతో టికెట్ మీకే అని తీసుకున్నారట. ఐతే ఎలెక్షన్ టైమ్ కి మళ్లీ డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళకి అని మళ్లీ పోటీ పెట్టి మళ్లీ ఇంకోసారి వాసూల్ చేశారట. తప్పక మరో 15 కోట్లు సమర్పించుకున్నారట ఆవిడ. అదే విధంగా రాజకీయాల్లోకి కొత్తగా రావడంతో పార్టీలోని చోటామోటా నాయకులందరు ఇబ్బడిముబ్బాడిగా ఖర్చు పెట్టించి బాగానే వెనకేసుకున్నారంటా. ఇంతా చేసి 2019లో టికెట్ కోసం పోరాటం చెయ్యాల్సిరావడం ఆమెకు మనస్తాపం కలిగిస్తుందట!