ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసు జీఏ-2 పిక్చర్స్ బ్యానర్ మీద సినిమాలు తీస్తున్నారు. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. నిజానికి ఒకప్పుడు గీత ఆర్ట్స్ లో పని చేసిన బన్నీ వాసుని అల్లు అరవింద్ నిర్మాత ను చేశారు. నిజానికి బన్నీ వాసు అల్లు అరవింద్ డబ్బులతోనే సినిమాలు తీస్తున్నారని, కేవలం పేరు మాత్రమే ఆయనదని ఇండస్ట్రీలో అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు బన్నీ వాసు వచ్చే ఎన్నికలలో జనసేన తరపున పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఆయన జనసేన తరపున పాలకొల్లు సీటును ఆశిస్తున్నారట. ఈ మధ్య ఆయన పార్టీలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు. ఈ నెల 15న రాజమహేంద్రవరం లో జరగబోయే భారీ బహిరంగసభ ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సభ నిర్వహణ కోసం జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఒక కమిటిలో ఆయనకు కూడా స్థానం దక్కింది. దీనితో ఆయనకు బహుశా సీటు అనేది కన్ఫర్మ్ అని జనసైనికులు అనుకుంటున్నారు. ఆ సభ తరువాత జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుంది.
జనసేన ఏర్పాటయ్యి ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది జనసేన పార్టీ. ఈ సభనుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం పూరిస్తారు. పాలకొల్లు సీటు నుండి గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున చిరంజీవి స్వయంగా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీనితో ఇక్కడ పోటీని జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. చిరంజీవి సాధించలేనిది అల్లు అరవింద్ మనిషి సాధిస్తారా అనేది చూడాలి.
What’s streaming on
OTT? Consult the experts!




