సునీతపై బన్నీ వాసు పోలీసు కంప్లయింట్

Bunny Vasuనిన్న నిర్మాత బన్నీ వాసు తనను సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని వాడుకుని వదిలేశారని జూనియర్ ఆర్టిస్టు సునీత ఆరోపించిన సంగతి తెలిసిందే. తనకు అల్లు అరవింద్ న్యాయం చెయ్యాలని ఆమె డిమాండ్ చేసింది. అయితే ఇప్పుడు ఆమెపై బన్నీ వాసుకి సంబందించిన జిఏ2 పిక్చర్స్ సంస్థ మాదాపూర్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఆమెపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ విషయం మీడియాపై ప్రముఖంగా రావడంతో పోలీసులు ఈ కేసులో ఒకింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

సునీత బన్నీ వాసుపై అసత్యప్రచారాలు చేసి ఆయన పరువుకు భంగం కలిగిస్తుందని, జనసేనకు పని చేశా కాబట్టి తనకు అవకాశాలు కలిపించాలని రుబాబు చేస్తుందని, సంస్థలో పని చేస్తున్న మేనేజర్లపై తరచూ నోరుపారేసుకుంటుందని కంప్లయింట్ లో పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా బన్నీ ఫ్రెండ్ గా ఇండస్ట్రీకి వచ్చిన బన్నీ వాసు తొలుత చిత్ర పంపిణీరంగంలో ప్రయత్నించి చెయ్యి కాల్చుకున్నారు. ఆ తరువాత బన్నీ వాసు గీతా ఆర్ట్స్ మరో బ్యానర్ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద సినిమాలు నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే, అఖిల్ – బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలను నిర్మిస్తున్నారు. మరిన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆయన జనసేన పార్టీకి ఉభయగోదావరి జిల్లాలలో తెరవెనుక సాయం అందించారు. పాలకొల్లు టిక్కెట్ కోసం చివరి నిముషం వరకూ ప్రయత్నాలు చేశారు. అయితే కొన్ని చివరి నిముషం సమీకరణాల వల్ల ఆయనకు టిక్కెట్ ఇవ్వడం పవన్ కళ్యాణ్ కు సాధ్యపడలేదు.

Follow @mirchi9 for more User Comments
2500 Acres of Amaravati For Land for the Poor SchemeDon't Miss2500 Acres of Amaravati For Land for the Poor Scheme?Andhra Pradesh Government is taking steps to ensure that the Capital is not shifted to...Chandrababu-Naidu-Has-Very-Little-To-Worry-About-Scrapping--the-CouncilDon't MissNaidu Has Very Little To Worry About Scrapping the CouncilYSR Congress has initiated a discussion in the Assembly about the scrapping of Council. The...CBI-Court-Serious-on-CM--YS-JaganDon't Missకోర్టులో జగన్ కు మళ్ళీ చుక్కెదురుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఆయనకు కోర్టులో చుక్కెదురయ్యింది....Pawan-Kalyan - YS-Jagan-Don't MissYSR Congress Not To Spare Pawan Kalyan Despite Being A Partner of BJP?Ruling YSR Congress Party seems to be trying to fire salvos on Janasena President Pawan...Prabhas' Screen Mother Bhagyashree Calls It Heaven on EarthDon't MissPrabhas' Mother Calls It Heaven on Earth1989 & 90 were the years when Bhagyashree's name was on everyone's tongue as the...
Mirchi9