Buggana Rajendranath Reddyపోలవరం ప్రాజెక్టు కు సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న వాదన చిత్రంగా ఉంది. అర్దరాత్రి సమయంలో ఆనాడు ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారని, అందులో భాగంగా 2014 దరలకే పోలవరం నిదులు ఇచ్చేలా కేంద్రంతో ఒప్పందం అయ్యారని… దీనివల్ల ఎపికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.

ఇక్కడ విశేషం ఏమిటంటే… అప్పట్లో 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టు విలువ బాగా పెరుగిపోయిందని అంచనాలు సవరించి… కేంద్రంతో ఆమోదింపచేసుకునే పనిలో ఉంటే… 16000 కోట్ల ప్రాజెక్ట్ ని 50000 కోట్లకు పెంచేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ వారు.

ఇప్పుడు మాత్రం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వేసిన అంచనాలే కావాలని… వాటిని కేంద్రం ఆమోదించాలని కోరడం గమనార్హం. చంద్రబాబు ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టి కమీషన్ల కోసం ప్యాకేజీకి అంగీకరించారని బుగ్గన ఆరోపించారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే విభజన చట్టం ప్రకారం 2014 తరువాత పోలవరం మీద పెట్టే ప్రతీ రూపాయి ఖర్చు కేంద్రమే భరించాలి.

అప్పుడు చంద్రబాబు ఏమి అంగీకరించినా… ఏం మాట్లాడినా చట్టప్రకారం రావాల్సిన రావాలి. కేంద్రంతో పోరాడి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యకుండా ఎవరూ చూడని చంద్రబాబు ఒప్పందం అంటూ ఊదరగొడుతుంది ఇప్పటి అధికార పక్షం. ఇటువంటి రాజకీయ ఆరోపణలు మాని చట్టబద్ధంగా రావాల్సిన వాటా కోసం అవసరమైతే న్యాయపోరాటం చెయ్యాలి.