Buddha Venkanna warning to kodali nani“బడి పంతులు” సినిమాలో “బూచాడమ్మా .. బూచోడు బుల్లిపెట్టెలో ఉంటాడు” అంటూ చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రీదేవి ఆలపించిన పాట అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ పాటను వైసీపీ మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి టీడీపీ నేత బుద్ధా వెంకన్న పాడుతున్నారు. ఆయనకు టీడీపీ సోషల్ మీడియా కూడా తన వంతు సృజనాత్మకతను జోడించి కాస్త మసాలా దట్టించింది.

“బూచాడమ్మా బూచాడు., వైసీపీలో ఉంటాడు, నోటికెప్పుడు హద్దనేది ఉండదు., బూతులెన్నో చెబుతాడు, కోతలెన్నో కోస్తాడు., కరకర మంటూ గుట్కాలేస్తాడు., చకచక మంటూ పేకాట క్లబ్ లను నడుపుతాడు., బూచాడమ్మా బూచాడు” అంటూ పేరడీ సాంగ్స్ తో విరుచుకు పడుతున్నారు టీడీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా వింగ్.

ప్రతిపక్ష నేత చంద్రబాబుని, అతని కుమారుడు లోకేష్ ని బూతులు తిట్టడానికే జగన్ ఒక శాఖను ఏర్పాటు చేసి, దానికి కొడాలి నానిని మంత్రిగా నియమించినట్లుగా మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి, ఒక రకంగా చెప్పాలంటే బూతులు తిట్టడానికే మీడియా ముందు వచ్చే కొడాలి నాని మంత్రి పదవి ఉండడం వల్లే చంద్రబాబుని ఈ మాత్రం తిట్లతో సరిపెడుతున్నానని, ఈ మంత్రి పదవి లేకపోతే తన ‘విశ్వరూపం’ చూపిస్తానంటూ తన సొంత భాషలో చంద్రబాబుపై విమర్శలు చేశారు.

కొడాలి నీకు మంత్రి పదవి వచ్చి మూడు సంవత్సరాలే అయ్యింది. ఇంతకు ముందంతా మేము చూసింది నీ విశ్వరూపమేగా., ఇంకా కొత్తగా చూపించేదేముంది., కొంపతీసి బట్టలు ఊడతీసి తిరుగుతావా అంటూ బుద్ధా వెంకన్న తన విమర్శల రూపాన్ని ప్రదర్శించారు. సినిమా ప్రారంభానికి ముందు వచ్చే ముకేష్ యాడ్ కు బదులు ‘గుట్కా నాని’ అంటూ నిన్ను చూపించాలి, అప్పుడు నువ్వు ఇంకా ఫేమస్ అయిపోతావు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

చంద్రబాబు జోలికి వెళ్లాలంటే ముందు బుద్ధా వెంకన్నను దాటాలని., బాబు గారిని కాదు కదా., వారి ఇంట్లో ఉండే కుక్క బొచ్చు కూడా పీకలేరు మీరు, మీ నాయకులు అంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు. నువ్వు మాకు విశ్వరూపం చూపించడం కాదు, వచ్చే ఎన్నికల ఫలితాల తరువాత మా విశ్వరూపం నువ్వు చూడాల్సి వస్తుంది, ‘గెట్ రెడీ టు ఫేస్ ఇట్’ అంటూ కొడాలికి హెచ్చరికలు పంపారు.

ఇంట్లో పసిపిల్లలు అన్నం తినమని మారం చేస్తే బూచాడొస్తాడని భయపెట్టి పిల్లలకు భోజనం తినిపించే తల్లులు, ఇప్పుడు నిన్ను చూపించి పిల్లలకు గోరు ముద్దలు పెడుతున్నారు. చివరికి ఏపీ పౌరసరఫరాల శాఖా మంత్రిగా కన్నా ఇలా “బూచాడిగా – బూతుల మంత్రిగా” పేరు సంపాదించుకున్న సంస్కారం లేని కొడాలి నానికి ఓ నమస్కారం అంటూ బుద్ధా ముగించారు.