Buddha venkanna - Nara Lokeshవైఎస్సార్ కాంగ్రెస్, దాని మీడియా, ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ తమ పై ఉద్దేశపూర్వకంగా బురదజల్లే కార్యక్రమం చేస్తుందని కావాలని అసత్యాలు ప్రచారం చేసి తమను అధికారం నుండి తప్పించారని, అయితే ఇక ముందే అటువంటి వాటిని తాము ఉపేక్షించబోమని తెలుగుదేశం పార్టీ గట్టిగా నిర్ణయించుకుందట.

దీనిలో భాగంగా తన పై ప్రచురించిన ఒక అసత్య కథనం పై నారా లోకేష్ సాక్షి మీడియాపై 75 లక్షలకు పరువు నష్టం దావా వేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ పై విజయవాడ సిటీ పోలీసు కమీషనర్ కు ఫిర్యాదు చేశారు.

బుద్దా వేయించిన ఫ్లెక్సీని మార్ఫ్ చేసిన వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ అధినేత చంద్రబాబును కించపరిచేలా దాన్ని రూపొందిచారు. దీన్ని గమనించిన బుద్దా.. దానికి ఇటీవల విడుదలైన మహేశ్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’లోని డైలాగ్‌తో కౌంటర్ ఇచ్చారు. వైసీపీ మార్ఫింగ్ ట్రిక్స్ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అని కామెంట్ పెట్టిన ఆయన.. ఫేక్ , రియల్ ఫొటొలను పోస్ట్ చేశారు.

దానితో పాటు రుజువులతో సహా అందుకు బాధ్యులైన వారి మీద యాక్షన్ తీసుకోవాలని విజయవాడ సిటీ పోలీసు కమీషనర్ ఫిర్యాదు చేశారు. జగన్ దొంగ అయితే.. అంతకంటే పెద్ద దొంగలు తామని వైసీపీ కార్యకర్తలు నిరూపించుకుంటున్నారని విమర్శించారు. ఆయన వేసే ముష్టి 5 రూపాయిల కోసం ఎంతకైనా దిగజారుతున్నారని మండిపడ్డారు.