Maruthi's-Obsession-Not-Over-Yet---'Brand-Babu'టాలీవుడ్ లో నేడు మూడు సినిమాలు విడుదలయ్యాయి. అందులో “గూఢచారి, ఛి||ల||సౌ||” సినిమాలకు పాజిటివ్ టాక్ లభించగా, మూడో సినిమా “బ్రాండ్ బాబు” ఈ రెండు బొమ్మల మధ్య నలిగిపోయినట్లుగా కనపడుతోంది. పాజిటివ్ టాక్ వచ్చిన రెండు సినిమాల టాక్ సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుండడంతో, అసలు ‘బ్రాండ్ బాబు’ ఊసే లేకుండా పోయింది.

అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందనేది ప్రేక్షకుల టాక్. ‘భలే భలే మగాడివోయ్, మహానుభావుడు’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాల మారుతీ ‘బ్రాండ్’తో విడుదలైన ‘బ్రాండ్ బాబు’ బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు. బహుశా సింగిల్ గా విడుదలయ్యుంటే కొంతవరకు ‘పర్లేదు’ అన్న టాక్ వచ్చేదేమో గానీ, రెండు హిట్టు బొమ్మల మధ్యలో పడి పత్తా లేకుండా పోయింది.

ఇక “గూఢచారి, ఛి||ల||సౌ||” సినిమాలకు సినీ విశ్లేషకుల నుండి మంచి స్పందన రావడంతో ఈ రెండు చిత్రాల యూనిట్స్ ఫుల్ ఖుషీలో ఉన్నాయి. అలాగే ‘గూఢచారి’ ఫేం అడవి శేష్ మరియు ‘ఛి||ల||సౌ||’ ఫేం రాహుల్ లు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండడంతో… వీరిద్దరి హంగామాతో ఈ రెండు సినిమాల పబ్లిసిటీ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది.