Brand Babu Trailer Talkమారుతీ మార్క్ సినీ సన్నివేశాలతో ఆగష్టు 3వ తేదీన “బ్రాండ్ బాబు” ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఈ సినిమా ట్రైలర్ స్పష్టం చేసింది. ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్, గతంలో రిలీజ్ చేసిన టీజర్ కు కొనసాగింపుగా ఉంది. కేవలం ‘బ్రాండ్స్’ మాత్రమే వినియోగించే ఉన్నత కుటుంబంలోకి ఓ పనిమనిషి ఎలా కోడలుగా అడుగుపెట్టింది అనేదే సినిమా కాన్సెప్ట్. వినడానికి ఫన్నీ, చూడడానికి రొటీన్ గా అనిపిస్తోన్న ఈ ట్రైలర్ లో…

హీరో తండ్రి క్యారెక్టర్ పోషిస్తోన్న మురళీశర్మ ట్రైలర్ కు హైలైట్ గా నిలువగా, కోడలు క్యారెక్టర్ లో ఉన్న ఈషా రబ్బా ఆ తదుపరి స్థానాన్ని ఆక్రమించింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఫన్ ప్రేక్షకులను మెప్పించగలిగితే పర్లేదు గానీ, లేదంటే ‘బ్రాండ్’ కాస్త ‘బ్యాండ్’గా మారిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కన్నడలో మూడు సినిమాలు చేసిన శైలేంద్ర ఈ సినిమా ద్వారా తెలుగులో అడుగు పెడుతున్నాడు.