brahmotsavam teaser releasing on january 1ప్రస్తుతం ఇదే ప్రశ్న ప్రిన్స్ అభిమానుల మదిలో మెదులుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు – విక్టరీ వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ సినిమా “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” ఫస్ట్ టీజర్ విడుదలయ్యే సమయంలో కూడా అభిమానుల మదిలో ఇదే ఆలోచన కలిగింది. అపుడు ‘కూల్’ లుక్ తో వచ్చి ‘కూల్’ హిట్ అందుకుంది చిత్ర యూనిట్. దీంతో ఈ సారి ప్రిన్స్ లుక్ ఏ విధంగా ఉండబోతోంది అని అభిమానుల్లో ఉత్సుకత మొదలైంది.

“బ్రహ్మోత్సవం” నిర్మాతలు అందించిన సమాచారం మేరకు 40 సెకన్లతో కూడిన టీజర్ ను జనవరి 1వ తేదీ ఉదయం 9.36 నిముషాలకు విడుదల చేయబోతున్నారు. అయితే ట్రేడ్ వర్గాలలో లభిస్తున్న సమాచారం మేరకు “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం మాదిరే అందరి పాత్రలను పరిచయం చేసే విధంగా టీజర్ ఉండబోతుందని తెలుస్తోంది.

ప్రిన్స్ మహేష్ బాబు లుక్ తో పాటు హీరోయిన్లుగా నటిస్తున్న ముగ్గురు ముద్దుగుమ్మల గెటప్ లు కూడా ఈ టీజర్ లో దర్శనమివ్వనున్నాయట. 2016 స్పెషల్ గా రాబోతున్న ఈ టీజర్ పై ప్రిన్స్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి కొత్త ఏడాది తొలిరోజునే “బ్రహ్మోత్సవం” హంగామా షురూ కానుంది.