Brahmotsavam- Tamilటాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచిన చిత్రం “బ్రహ్మోత్సవం.” ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లో దారుణమైన కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా రికార్డు పొందిన ఈ సినిమాను ఆగష్టు 17వ తేదీన తమిళంలో విడుదల చేయబోతున్నారు. “అనిరుధ్” అనే పేరుతో విడుదల కానున్న ఈ సినిమాతో ఏం సాధించాలనుకుంటున్నారో గానీ, కనీసం డబ్బింగ్ లకు, ప్రింట్ లకు పెట్టిన ఖర్చైనా వస్తుందో లేదో అన్నది అనుమానమే.

మహేష్ కు తమిళనాట మంచి ఫాలోయింగ్ ఉన్న మాట నిజమే గానీ, ‘బ్రహ్మోత్సవం’ లాంటి సినిమా అక్కడ అద్భుతాలు సృష్టిస్తుందని భావించడం అత్యాశే అవుతుంది. సూపర్ స్టార్ డం ఉన్న తెలుగు రాష్ట్రాలు, యుఎస్ లోనే ఈ సినిమా ప్రతికూల ఫలితాలను అందుకోగా, ఇప్పుడు తమిళంలోకి విడుదల చేయడం ఎందుకో అర్ధం కాని పరిస్థితి. బహుశా ‘భరత్ అనే నేను’ సినిమాకు తమిళనాట వచ్చిన క్రేజ్ ను ఈ ‘అనిరుధ్’తో క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారేమో!?