brahmotsavam-movie-audio-launch-date-officialతెలుగు హీరో అయినప్పటికీ, ప్రిన్స్ మహేష్ బాబు అంటే దాదాపుగా దేశవ్యాప్తంగా పరిచయం ఉన్న పేరే. జాతీయంగా ఎలాంటి సెలబ్రిటీ సర్వేలు జరిగినా… అందులో దక్షిణాది నుండి మహేష్ బాబు పేరు రావడం చాలా కామన్ గా జరిగే విషయం. అలాంటి ప్రిన్స్ తో ప్రముఖ ఎన్డీటీవీ “బ్రహ్మోత్సవం” సినిమాపై చిట్ చాట్ ప్రశ్నలను సంధించింది.

“బ్రహ్మోత్సవం” అనే కధ కుటుంబ ప్రధానంగా సాగుతుందని, అన్ని తరాలకు చెందిన జనాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో అన్న దానికి నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. ఈ సినిమాలో రోల్ గురించి ‘ఛాలెంజింగ్’ అనే పదం తప్పని, కధ వినే సమయంలో తనకు ‘ఎక్సైట్ మెంట్’గా అనిపించాలని, ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో పాత్ర ఇప్పటివరకు నేను పోషించనిదని చెప్పిన ప్రిన్స్, ఈ సినిమా విడుదల తేదీని మాత్రం ఆడియో రిలీజ్ రోజున ప్రకటిస్తారని తెలిపారు.

‘గత ఏడాది విడుదలైన ‘శ్రీమంతుడు’ సినిమా తన ఆలోచనలకు దగ్గరగా ఉంటుందని, తన ప్రొడక్షన్ యూనిట్ లో మొదటి సినిమా, అన్నింటికీ మించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని, సినిమాలు ఫ్లాప్ అయితే చాలా వ్యక్తిగతంగా తీసుకుంటానని, సినిమాల్లో నటించడం తప్ప తానూ మరొకటి ఆలోచించలేదని… తన అనుభవాలను పంచుకున్నారు ప్రిన్స్.