brahmotsavam bichagadu, Mahesh Babu, Srikanth addala, brahmotsavam under loss, brahmotsavam collections, Tamil remake, bichagadu collections, Super Star Mahesh భారీ బడ్జెట్ తో తెరకెక్కిన స్ట్రెయిట్ తెలుగు సినిమా కధ ఒకటైతే, లో బడ్జెట్ తమిళ రీమేక్ గా తెలుగులోకి వచ్చిన కధ మరొకటి. అయితే ఈ రెండింటిని వేరు చేసింది ‘సక్సెస్’ అనే ఇండస్ట్రీ మంత్రం. నిజానికి ఈ రెండు సినిమాలను పోల్చడానికి అవకాశం లేదు, కానీ, ఒక వారం తేడాలో విడుదలైన ఈ రెండు సినిమాలలో చిన్న సినిమా సక్సెస్ గ్రాఫ్ ను ఒక భారీ బడ్జెట్ సినిమా ఏ రేంజ్ లో పెంచేసిందో తెలుసుకుంటే అవాక్కవ్వాల్సిందే.

ప్రీ రిలీజ్ కు ముందు దాదాపు 100 కోట్లు బిజినెస్, అలాగే సినిమా నిర్మాణం దాదాపుగా 70 కోట్లు అయ్యిందనే ఇండస్ట్రీ వర్గాల టాక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ బాగా అయితే 40 కోట్ల షేర్ వరకు వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ‘బ్రహ్మోత్సవం’ భారీ నష్టాలను తెచ్చిందన్న విషయం బహిరంగమే. అయితే సరిగ్గా ఈ సినిమా విడుదల వారం రోజుల ముందు ‘బిచ్చగాడు’ అనే ఒక అతి సాధారణమైన రీమేక్ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

కేవలం 50 నుండి 60 స్క్రీన్లల్లో మాత్రమే విడుదలైన ఈ ‘బిచ్చగాడు’ స్క్రీన్స్ ‘బ్రహ్మోత్సవం’ రెండవ రోజు నుండి అమాంతం పెరిగిపోయాయి. కేవలం 50 లక్షలతో ‘పిచ్చైక్కరన్’ అనే తమిళ సినిమా డబ్బింగ్ హక్కులు కొనుగోలు చేసిన చదలవాడ లక్ష్, మార్కెటింగ్ మరియు ఇతర వ్యయాల నిమిత్తం మరో 1.50 కోట్ల రూపాయలు ఖర్చు చేసారు. అయితే ‘బ్రహ్మోత్సవం’ పుణ్యమా అంటూ ఏకంగా 13 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ను కొల్లగొట్టి టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

ఈ విజయం పట్ల చదలవాడ లక్ష్ అవాక్కవుతున్నారు. ‘బ్రహ్మోత్సవం’ సినిమా రెండవ నుండి చాలా మంది ఎగ్జిబిటర్స్ తమ ‘బిచ్చగాడు’ను ప్రదర్శించారని, దీంతో ఎక్కువ స్క్రీన్లు రావడంతో కలెక్షన్స్ పెరిగాయని లక్ష్ వివరించారు. తొలుత రీమేక్ చేద్దామని భావించినప్పటికీ, అదే ఫ్లేవర్ ను రప్పించడం కుదరదన్న భావనతోనే డబ్బింగ్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు. కాస్త ‘కంటెంట్’ ఉంటేనే ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఆశీర్వదిస్తారో అన్న దానికి ‘బిచ్చగాడు’ సినిమానే ఒక నిదర్శనం. మొత్తానికి ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో ‘బిచ్చగాడు’ హక్కులు తీసుకున్న వారు కోటీశ్వరులుగా మారారు.