Brahmanandam about Allu Arjun, sarrainoduఊహించని విధంగా ‘సరైనోడు’ సక్సెస్ కావడంతో సక్సెస్ సంబరాల్లో మునిగి తేలుతున్న అల్లు అర్జున్ చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి తన అనుభూతులను పంచుకున్నారు. దర్శకుడు, నిర్మాత తదితరులతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూల మాదిరే కమెడియన్ బ్రహ్మానందంతోనూ బన్నీ మీడియా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా బ్రహ్మి ఇచ్చిన జవాబుపై సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.

బ్రహ్మానందం గారిని తెరపై చూడగానే సాధారణంగా నవ్వు వచ్చేస్తుంది… అదే షూటింగ్ టైంలో మీరు ఎలా చేయగలిగారు? అని బన్నీని యాంకర్ అడగగా, అవును… అది నిజమే… అంటూ బన్నీ చెప్తుండగా, మైక్ అందుకున్న బ్రహ్మి… మీకు తెలియని అసలు విషయం ఏమిటంటే… అలా కనపడుతుంటాడు గానీ, బన్నీ చాలా పెద్ద కోతి… అందుకే ‘సరైనోడు’ సినిమాలో నేను కనపడ్డప్పుడు అలాంటి ఎక్స్ ప్రెషన్స్ ను అవలీలగా ఇచ్చేసాడు అంటూ బ్రహ్మి చెప్తుంటే… మురిసిపోతూ…. సిగ్గుపడుతూ… ముసిముసి నవ్వులు నవ్వడం బన్నీ వంతయ్యింది.

అయితే బన్నీపై బ్రహ్మి చేసిన “బన్నీ చాలా పెద్ద కోతి” కామెంట్ పై సోషల్ మీడియాలో రకరకాలుగా కౌంటర్లు పడుతున్నాయి. ముఖ్యంగా పవన్ అభిమానుల నుండి ఈ కామెంట్ కు విశేషమైన స్పందన లభిస్తోంది. అవకాశం చిక్కితే పంచ్ లు వేయడం ఎవరైనా చేసేదే కదా!