post-aravinda-sametha-ram-charan-weakness-to -be-coveredటాలీవుడ్ టాప్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి ‘దమ్ము’ యావరేజ్ మినహా మిగిలిన సినిమాలు అన్నీ మంచి పేరునే తెచ్చి పెట్టాయి. అయితే పెద్ద హీరోల్లో బాలకృష్ణతో రెండు సినిమాలు మినహాయిస్తే మిగిలిన సినిమాలు అన్నీ బోయపాటి ఇప్పటి వరకూ యువ హీరోలతోనే చేస్తూ వస్తున్నాడు. మరి అలాంటి బోయపాటికి ఓవర్‌సీస్ లో మార్కెట్ లేదంటే నమ్ముతారా?ఆయన సినిమాలకు ఓవర్‌సీస్ లో ఆధరణ లేదు అంటే నమ్మగలరా?

ఇదిలా ఉంటే మరో పక్క టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కి సైతం ధృవ, రంగస్థలం మినహాయిస్తే ఆయనకు కూడా ఓవర్‌సీస్ లో చెప్పుకోదగ్గ మార్కెట్ లేదు. ధృవతో తన సినిమాల్లోనే ఓవర్‌సీస్ లో తొలి మిలియన్ డాలర్ సినిమా రేస్ లో నిలిచిన చెర్రీ, రంగస్థలంతో దుమ్ము దులిపి వదిలి పెట్టాడు. ఇదిలా ఉంటే మరో పక్క సంక్రాంతి బరిలో నిలుస్తున్న రామ్‌చరణ్-బోయపాటి శ్రీను “వినయ విధేయ రామ” పైనే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ప్రేక్షకుల్లో. ఇక ఇప్పటికే రంగస్థలంతో మంచి హిట్ సాధించిన చెర్రీకి అక్కడ మంచి మార్కెట్ కూడా రావడంతో ఈ సినిమాకి అక్కడ కూడా మంచి ఓపెన్‌నింగ్స్ ఉంటాయి అని, అందరూ అనుకుంటున్నారు అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటి అంటే రంగస్థలం దర్శకుడు సుకుమార్ కి ఓవర్‌సీస్ లో మంచి మార్కెట్ ఉంది. ఇక రంగస్థలం కి చెర్రీ కన్నా సుకుమార్ బాగా ప్లస్ ఆయ్యాడు అనే చెప్పాలి.

అయితే తాజాగా ఎన్టీఆర్ గత చిత్రం ‘అరవింద సమేతా’కి కూడా అక్కడ అనుకున్నంత హిట్ ని సాధించలేదు దానికి కారణం ఎన్నారైలు మాస్ సినిమాలను పెద్దగా ఆదరించకపోవడమే, పైగా ఇక్కడ త్రివిక్రమ్ బ్రాండ్ ఉన్నా పెద్దగా పని జరగలేదు. బహుశా మాస్ అనే కారణం చేతనే లోకల్ గా భారీ హిట్స్ కొడుతున్న బోయపాటికి ఓవర్‌సీస్ లో మార్కెట్ లేకపోవడం. అయితే ఇప్పుడు ఈ “వినయవిధేయరామ” మంచి హిట్ సాధిస్తే మాత్రం ఈ సినిమాతో అయినా బోయపాటికి అక్కడ మార్కెట్ లో చోటు దక్కుతుందేమో చూడాలి. మరి మరో పక్క ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఇదే సమయంలో కావడంతో బోయపాటికి ఇది అగ్ని పరీక్షే అని చెప్పక తప్పదు మరి.