Boyapati Srinu Down, Temporarilyతన సినిమాలలో రౌద్రరసం పండించడంలో బోయపాటికి ఆయనే సాటి. అయితే ఈ మధ్య ఆయనను వరుసగా రెండు పరాజయాలు పలకరించాయి. దీనితో బోయపాటిని పలకరించేవారే లేకపోయారు. దీనితో ఆయన గతంలో రెండు పెద్ద హిట్లు ఇచ్చిన బాలయ్య వైపు చూస్తున్నారు. బాలయ్య కూడా బోయపాటితో పని చెయ్యడానికి ఇష్టపడి స్క్రిప్ట్ రెడీ చెయ్యమన్నారు. మొత్తానికి బాలకృష్ణ సూచన మేరకు బోయపాటి శ్రీను స్క్రిప్ట్ పనులను పూర్తి చేశాడు.

అయితే సింహా, లెజెండ్ సినిమాల తరువాత వీరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో ఉంటుందో ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. ఎప్పుడో మొదలవ్వాల్సిన సినిమా హై బడ్జెట్ కారణంగా పోస్ట్ ఫోన్ అయింది. 60 కోట్లు బడ్జెట్ ను బోయపాటి 40 కోట్లకు కుదించినా సినిమా ఎప్పుడు ఉంటుందో ఇంకా తెలియని పరిస్థితి. బాలయ్య ఈలోగా తన జయసింహ దర్శకుడు కెఎస్ రవికుమార్ తో సినిమా కూడా ఒప్పుకున్నాడు. అయితే ఆ తరువాత సినిమా అయినా నీకు చేస్తా అని బాలయ్య కమిట్ మెంట్ ఇచ్చారా అంటే అదీ లేదు.

దాంతో సినిమా వదులుకోవాలా.. ? లేక బాలయ్య పిలుపు కోసం ఎదురు చూడాలో..? అని అర్ధం కానీ పరిస్థితుల్లో ఉన్నాడట బోయపాటి. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. కొందరేమో సింహా, లెజెండ్ సినిమాల తరువాత వచ్చే సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉంటాయని అయితే బోయపాటి తెచ్చిన స్క్రిప్ట్ బాలయ్యకు అంతగా ఎక్కలేదని చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమా పట్టాలెక్కి హిట్ అయితే మాత్రం బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే.