Boyapati srinu behind  Vinaya Vidheya Rama disasterతప్పులేదు…ఒక బడా హీరో అయినా, కొత్తగా ఎంట్రీ ఇస్తున్న డెబ్యూ హీరో అయినా దర్శకుణ్ణి, కథను నమ్మాలి. కానీ హిట్ అయితే హారతులు పట్టించుకుంటూ, ప్లాప్ అయితే మాత్రం దర్శకుడి మీదకు తోసెయ్యడం ఎంతవరకూ న్యాయమో హీరోలు కాస్త ఆలోచించుకోవాలి. అప్పట్లో బాలయ్య…ఇప్పుడు చెర్రీ ఇద్దరూ కూడా ఇదే చెబుతున్నారు..

అప్పట్లో “ఒక్కమగాడు” సినిమా భారీ డిజాస్టర్ గా మారడంతో ఆ తర్వాత జరిగిన ఒకానొక ఇంటర్వ్యూ లో బాలయ్య మాట్లాడుతూ దర్శకుడు చౌదరిని నమ్మి కథ కూడా వినకుండా సినిమా చేసాను అని చెప్పారు. ఇప్పుడు చెర్రీ కూడా సినిమాలో అసలు నేను వేలు పెట్టలేదు, దర్శకుడు ఎలా చెబితే అలా చేసాను అని అంటున్నారు.

అంటే సినిమా డిజాస్టర్ అయ్యింది కనుక ఆ నిందని దర్శకుడిపైకి నెట్టెయ్యడం ఎంతవరకూ న్యాయం. మా బుర్రలు వాడలేదు, దర్శకుడు ఎలా చెబితే అలా చేసాం అంటున్నాడు చెర్రీ.

ఇది మరీ వింత కాకపొతే, ఎన్నో సార్లు మెగాస్టార్ ఈ సినిమా సెట్స్ ను సందర్శించారు అప్పుడైనా అప్పటివరకూ జరిగిన సీన్స్ చూసినప్పుడైనా తెలియలేదా..కొన్ని సీన్స్ మరి అతిగా ఉన్నాయి అని, ఏది ఏమైనా…సినిమా రిజల్ట్ తేడా కొట్టిందిగా అందుకే ఈ ఫీట్స్ అన్నీ అప్పుడు బాలయ్య అయినా, ఇప్పుడు చెర్రీ అయినా .