boyapati - Sreenu - to launch Nandamuri Mokshagna--నందమూరి నట సింహం బాల కృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది పక్కాగా ఉంటుంది అని ఇప్పటికే బాలయ్య చాలా సార్లు కంఫర్మ్ చేసాడు. అయితే ఇదిగో ఈ దర్శకుడు…అదిగో ఆ దర్శకుడు అంటూ హడావిడి ఏమి లేకుండా బాలయ్య మోక్షుని పక్కాగా దించాలి అని ప్లాన్ చేస్తున్నాడు అని తెలుస్తుంది.

అయితే మాస్ సినిమాతో మోక్షుని బాలయ్య దించుతాడు అని చాలా మంది అనుకున్నారు…ముఖ్యంగా బాలయ్య ఇష్టపడే బోయపాటి దర్శకత్వంలో మోక్షు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని చాలా సార్లు వార్తలు వినిపించాయి. అయితే దీనిపై బోయపాటి క్లారిటీ ఇచ్చి లేదు మోక్షు ఎంట్రీ నా దర్శకత్వంలో కరెక్ట్ కాదు…ఎందుకంటే అదే జరిగితే నందమూరి అభిమానులకు అంచనాలు భారీగా పెరిగిపోతాయి, అయితే తొలి సినిమాతో అంతగా అంచనాలు ఉంటే కష్టం అవుతుంది అని బోయపాటి క్లారిటీ ఇచ్చాడు.

అంటే బోయపాటి మాటల ప్రకారం చూస్తే బాలయ్య మోక్షుని క్లాస్ గా దించాలి అని చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మాస్ సినిమా ఫార్మాట్ అంటే బోట్ కొట్టిన క్రమంలో ఇప్పుడు యువ హీరోలు అందరూ సరికొత్త కథలనే ఎంచుకుంటున్నారు..ఆ క్రమంలో మోక్షు కూడా సరికొత్త కథతో క్లాస్ ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.

ఏది ఏమైనా మోక్షు ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని చెప్పక తప్పదు. మరి మోక్షు ఎంట్రీ ఎలా ఉండబోతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ!