Botsa-Satyanarayana--YSR-Congressవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు మరీ ముఖ్యంగా మునిసిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల వల్ల రాజధానికి భూములిచ్చిన రైతులలో ఆందోళన నెలకొంది. కొందరు రైతులు ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ నాయకులను కలిసి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు భూములు ఇచ్చిన రైతులు ఈరోజు ధర్నా కు కూడా కూర్చున్నారు. అయితే రైతుల ధర్నాపై మంత్రి బొత్స తనదైన శైలిలో స్పందించారు.

రాజధాని తరలిపోతుందనే ప్రజల్లో ఉన్న ఆందోళనకు తాము వెళ్లి సమాధానం చెప్పుకుంటామని అన్నారు. అమరావతి రైతులు ధర్నా చేస్తున్నది కౌలు అందడం లేదనే తప్ప.. రాజధాని విషయంలో కాదని వ్యాఖ్యానించారు. రైతులకు కౌలు ఇచ్చే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. వారం పదిరోజుల్లో రైతులకు కౌలు అందే ఏర్పాటు చేస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. కౌలు గురించి వర్రీ అవుతున్న రైతులు రాజధాని తరలిపోతుందన్న బెంగ ఉండదా?

అసలు బొత్స చెప్పే దాంట్లో లాజిక్ ఉందా? దాదాపుగా నాలుగు సంవత్సరాలు బీడు పట్టేసిన పొలాలు, ఒకపక్క రేట్లు భారీగా పడిపోతున్నా బాధ పడటం లేదు రైతులు అంటే నమ్మే పరిస్థితి ఉంటుందా? మరో వైపు రాజధానిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్ వివరాలను సరైన సమయంలో బయటపెడతామని అన్నారు. రాజధాని భూ అక్రమాలపై తమ వద్ద ఖచ్చితమైన సమాచారం ఉందని ఉద్ఘాటించారు.