Narendra Modi - YS Jaganఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్ లో నిన్న ఇచ్చిన విందుకు పలువురు ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపించారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పిలిచి ఏపీ ముఖ్యమంత్రిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని పిలవకపోవడం వివాదాస్పదం అయ్యింది.

ముఖ్యమంత్రులను ఏ ప్రాతిపదిక మీద ఎంపిక చేసారో తెలీదు. అయితే జగన్ ని పిలవకపోవడం ఆంధ్రప్రదేశ్ లోని పాలకపక్షానికి ఇబ్బంది గానే ఉంది. అయితే జగన్ ను ఎందుకు పిలవలేదు అనేదానిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఒక విషయం చెప్పారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులలో జగన్ ఒకరని అందుకనే ఆయనను పిలవలేదు అని బొత్స చెప్పుకొచ్చారు.

అంటే జగన్ కి ఉన్న ప్రజాదరణ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈర్స్యగా ఉన్నారని బొత్స చెబుతున్నారా? ఇక్కడ మరో విశేషం ఏమిటంటే… గతంలో ఇదే బొత్స రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే కేంద్ర ప్రభుత్వం తో కలుస్తాం అని చెప్పుకొచ్చారు. అయితే ఆ తరువాత అది వివాదాంశం కావడంతో మాట మార్చారు.

ఇప్పుడు అదే బొత్స జగన్ పాపులారిటీ పై మోడీకి ఈర్ష్య అన్నట్టు మాట్లాడుతున్నారు. దీనిపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదంతా పక్కన పెడితే…తెలంగాణలో బీజేపీ, కేసీఆర్‌కు అంతగా పొసగకున్నా ట్రంప్‌ కార్యాక్రమం వంటి వాటికి ఆహ్వనించటం, అదే సమయంలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులతో పాటు ఏపీ సీఏం జగన్‌ను పక్కన పెట్టడం నిజంగా విశేషమే.