Botsa Satyanarayanaచంద్రబాబు హయాంలో నిర్మించిన లక్షలాది ఇళ్ళను జగన్ ప్రభుత్వం ఖాళీగా పెట్టింది. ఎక్కడ అప్పటి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో అని వాటిని ఇవ్వడం లేదనే విమర్శ ఉంది. అయితే ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

అడుగు నిర్మాణానికి రూ.1500 ఖర్చును.. రూ.2 వేలు చొప్పున వెచ్చించి తెదేపా నేతలు దండుకున్నారని విమర్శించారు. బ్యాంకుల నుంచి సుమారు రూ.3,600 కోట్ల మేర అప్పులు తెచ్చి కమీషన్లు దండుకున్నారన్నారు. వారి హయాంలో లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా ఇప్పుడు ఆందోళనలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.

సరే మంత్రిగారు చేసిన ఆరోపణలు అన్ని నిజమే అనుకుందాం. అవినీతి జరిగితే అది రుజువు చేసి బాధ్యులైన వారిని జైలుకు పంపించాలి. అందుకు ఇళ్లని ఖాళీగా పెట్టడం ఎందుకు? లబ్దిదారులకు ఎందుకు ఇవ్వడం లేదు? కొంపతీసి ప్రజావేదిక లాగ ఒక బుల్డోజర్ తెచ్చి కట్టిన ఇళ్లని కూలగొట్టే ఆలోచన ఏమీ చెయ్యడం లేదు కదా?

తమ పార్టీ అధికారంలోకి వస్తే 300 చదరపు అడుగుల ఇళ్లను పేద ప్రజలకు ఉచితంగా ఇస్తామని నాడు జగన్ ప్రకటించారని ఈ సందర్భంగా బొత్స గుర్తు చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి చెప్పారు. రెడీగా ఉన్న ఇళ్ళు ఇవ్వకుండా కొత్తగా ఇల్లులు కట్టిస్తామని అంటే ప్రజలు ఎలా నమ్ముతారు?