Botsa satyanarayana ఏపీ రాజకీయాలలో ఒకరినొకరు ‘సన్నాసి… బుద్ధిలేని వెదవా…’ అని తిట్టుకొనే స్థాయికి దిగజారిపోయాయి కనుక ఇప్పుడు రాజకీయ నాయకుల నుంచి హుందాతనం ఆశించడం అత్యసే అవుతుంది. కనుక ఇప్పుడు ఒకరిని మరొకరు ఏవిదంగా తిట్టుకొన్నారో చెప్పుకొంటే అదే రాజకీయాల గురించి మాట్లాడుకోవడం అనుకోవాలేమో?

పవన్‌ కళ్యాణ్‌ తమ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా బదులిచ్చారు. “వాడో సెలబ్రేటీ సన్నాసి! ఆ సన్నాసి ఏదేదో వాగి మాలాంటి వాళ్ళచేత కూడా మాట్లాడిస్తున్నాడు. తనో తీవ్రవాదిని అని గొప్పగా చెప్పుకొన్నాడు. ఒకవేళ అతను తీవ్రవాది అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. గణతంత్ర దినోత్సవంనాడు కూడా హుందాగా మాట్లాడలేని సన్నాసి. ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుందన్నట్లు సబ్జెక్ట్ తెలీని పవన్‌ కళ్యాణ్‌ నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నాడు. అతని దగ్గర బోలెడంత డబ్బు ఉంది కనుక పెద్ద బండి కొనుకొన్నాడు. అయితే ఏంటంట? నన్ను ఎవడు ఆపుతాడో చూస్తానని అన్నాడు. ఆ సన్నాసిని ఆపేదెవడు? అసలు పట్టించుకొనేదెవరు?

బడుగు బలహీన వర్గాలకి మా ప్రభుత్వం 60 వేల కోట్లు ఇచ్చింది. ఇంకా ఇస్తుంది. మద్యలో అతనికి అభ్యంతరం దేనికి?అతనిలాగ దోచుకొని దాచుకొనే ప్రభుత్వం కాదు మాది. రాష్ట్రంలో అణగారిన వర్గాలకి సంపద పంచిపెట్టి వారి జీవితాలలో వెలుగులు నింపుతున్న ప్రభుత్వం మాది.

స్టీల్ ప్లాంట్‌ మీద ఆయనొక్కడికే ప్రేమ, ఆసక్తి ఉన్నట్లు మాకెవరికీ లేన్నట్లు మాట్లాడుతున్నాడు. అతనిలాగ మైకు పట్టుకొని రోడ్లమీద పడి గొంతు చించుకొని అరిస్తేనే అభిమానం ఉన్నట్లా లేకుంటే లేనట్లా?అసలు అతను మాట్లాడే భాష ఏమిటి?అతని మాటలు వింటే నాకు వైరాగ్యం వచ్చేస్తోంది,” అని అన్నారు.

విశాఖకి రాజధాని తరలింపు గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నకి మంత్రి బొత్స సత్యనారాయణ జవాబిస్తూ, “మూడు రాజధానులు మా ప్రభుత్వం విధానమని మేము మొదటి నుంచి చెపుతూనే ఉన్నాము. దానికే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కనుక ఈ ఏడాది ఉగాదిలోగా విశాఖకి తరలించాలని మంత్రులందరం సిఎం జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి చేస్తున్నాము. మంత్రివర్గ సమావేశంలో మేమడిగితే ఆయన కాదనరనే నమ్మకం మాకుంది,” అని అన్నారు.