Botsa Satyanarayana Andhra pradesh Assemblyనిన్నటి సస్పెన్స్ అనంతరం ఈరోజు శాసన మండలిలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ కొనసాగుతోంది. మండలిలో టీడీపీకి మెజారిటీ ఉండటంతో నారా లోకేష్ చర్చ ప్రారంభించారు. రాజధాని తరలిస్తే అమరావతిలో పెట్టిన ప్రజాధనం వృథా అవుతుంది. అన్ని ఆఫీసులు ఒకే దగ్గర ఉండాలని కేంద్రం చెబుతోందని లోకేష్ అన్నారు.

దక్షిణాఫ్రికాలో తప్ప ఎక్కడా మూడు రాజధానులు లేవు. మూడు రాజధానులతో ప్రజా ధనం వృథా అవుతుందని ఆదేశ అధ్యక్షుడే చెప్పారు అని లోకేష్ చెప్పుకొచ్చారు. అయితే లోకేష్ తన స్పీచ్ చదువుతుండగా…. మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం చెప్పారు. మండలిలో సెల్‌ఫోన్‌ చూస్తూ లోకేశ్‌ మాట్లాడటంపై ఆయన అభ్యంతరం తెలిపారు.

పరిశీలించి రూలింగ్‌ ఇవ్వాలని మండలి వైస్‌ ఛైర్మన్‌ను కోరారు. దీనిపై పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం స్పందిస్తూ.. మండలిలో వైఫై సౌకర్యం ఉందని, సెల్‌ఫోన్‌లో నోట్స్‌ చూస్తూ మాట్లాడేతే తప్పేముందన్నారు. మండలి ఛైర్మన్ కూడా అందులో తప్పు లేదు అనే చెప్పారు. అనంతరం లోకేశ్‌ తన ప్రసంగం కొనసాగించారు.

టెక్నాలజీని అందిపుచ్చుకుని పేపర్ కు బదులుగా ఫోన్లు, ఐప్యాడ్లలో చదవడం మంచిదేగా? ప్రభుత్వాలు కూడా ఈ మధ్య కాగితం వాడకం తగ్గించేందుకు డిజిటిల్ ని ప్రోత్సహిస్తుంది. మరి దానికి కూడా బొత్స గారికి అభ్యంతరం ఏంటో? “ప్రతిపక్షం ఏం చేసినా తప్పే అంటే ఎలా బొత్స గారూ? టెక్నాలజీని అంది పుచ్చుకోకుండా పేపర్ లో చదవాలి, పెన్నుతో రాయాలి అంటే ఎలా?,” అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజెన్లు.