Botsa-Satyanarayanaవైఎస్సార్ కాంగ్రెస్ 2019 ఎన్నికలలో విజయం సాధించగానే గ్రామా వాలంటీర్ల వ్యవస్థను తెరమీదకు తెచ్చింది. 2.3 లక్షల మంది పార్టీ అనుకూల వ్యక్తులను గ్రామా వాలంటీర్లగా నియమించింది ప్రభుత్వం. వారికి ఐదు వేల రూపాయిల భృతి చెల్లించింది. అయితే ఇటీవలే ప్రవేశపెట్టిన రేషన్ సరుకుల డెలివరీ డ్రైవర్లకు రెండు-మూడు రోజులలోనే జీతం పెంచడంతో వాలంటీర్లు భగ్గుమన్నారు.

తమతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని.. ఐదు వేలు ఏ మూలకు సరిపోవని జీతాలు పెంచాలని చాలా చోట్ల నిరసనలు తెలియజేశారు. వెంటనే ముఖ్యమంత్రి జగన్ ఒక బహిరంగ లేఖ రాశారు. “వాలంటీర్ అనేది ఉద్యోగం కాదు… సేవ..వారికి ఇచ్చేది జీతం కాదు గౌరవ భృతి. ఈ విషయం హ్యాండ్ బుక్‌లో స్పష్టంగా పేర్కొన్నాం,” అంటూ ముఖ్యమంత్రి వారిని మరింత రెచ్చగొట్టారు.

సీఎం వ్యాఖ్యల తరువాత పార్టీ నేతలు కూడా అటువంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. మంత్రి బొత్స వాలంటీర్లు రోజుకు 30 నిముషాలే పని చేస్తున్నారని జీతాలు పెంచమనడం సబబు కాదని చెప్పుకొచ్చారు. మరో నేత, లక్ష్మీపార్వతి అయితే వాలంటీర్లలో ఎంత మంది పింఛనులు ఇవ్వడానికి కూడా లంచాలు తీసుకున్నా ప్రభుత్వం ఏమీ అనలేదు సాక్షిలోనే వారి పరువుతీశారు.

వాలంటీర్ల వ్యవస్థను ఒక ప్లాన్ ప్రకారం ప్రవేశపెట్టారు. పథకాలు ఇంటింటికి చేర్చడమే కాకుండా ప్రభుత్వానికి వారు ఫుల్ గా పబ్లిసిటీ చేస్తారు. అంతే కాకుండా ఎన్నికల సమయంలో వారితో చాలా అవసరాలే ఉంటాయి. అటువంటి వారితో వైరం పెట్టుకోవడం అంటే కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే.