Botsa Satyanarayana comments on amaravati stirsరాజధాని విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ అడ్డు ఆపు లేకుండా చెలరేగిపోతున్నారు. రోజుకు ఒక్క విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు. తాజగా మీడియా ముందు ఆయన చేసిన ఒక వ్యాఖ్య బొత్స అవగాహనా రాహిత్యం బయటపెట్టింది అంటున్నారు టీడీపీ వారు. వివరాల్లోకి వెళ్తే…. అమరావతిలో 67 కిలో మీటర్ల మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్ చేసింది అప్పటి ప్రభుత్వం. దీని కోసం ఒక జర్మన్ బ్యాంకు, జెఎఫ్ డబల్యూ 1% వడ్డీకే ఋణం ఇవ్వడానికి ముందుకు వచ్చింది.

ఆ బ్యాంకు ఇటీవలే సదరు మంత్రి బొత్సను కలిస్తే ఆయన తన పాండిత్యం చూపించే ప్రయత్నం చేశారట. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు 490 కోట్లు అవుతుందని, అదే మాములు డ్రైనేజ్ అయితే 230 కోట్లే అవుతుందని ఇది దుబారా అని చెప్పేశారట. దానితో వారు ఖంగుమన్నారట. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఎక్కువ జనాభ ఉన్న చోట ఉండాలని, అమరావతిలో అటువంటి పరిస్థితి లేదని చెప్పుకొచ్చారట. ప్రపంచం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వంటి మేటి ప్రాక్టీస్స్ వైపు చూస్తుంటే మన మంత్రికి కనీసం దాని గురించిన ఉపయోగాలు కూడా తెలీదు.

స్మార్ట్ సిటీల పేరుతో భారత ప్రభుత్వం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లను ప్రోత్సహిస్తుంది. మొన్న ఆ మధ్య విజయవాడ, గుంటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లకోసం 2000 కోట్లు ఇచ్చింది కేంద్రం. రాజధాని అవసరాలకు అంటే ఒక 30-50 సంవత్సరాల నాటి పరిస్థితిని అంచనా వెయ్యాలి. ఇప్పుడు జనాభా తక్కువ కదా అని 260 కోట్ల కోసం కక్కుర్తి పడితే ఏం లాభం? ఇంకో విషయం ఏమిటంటే బ్యాంకులు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కే ఋణం ఇస్తుందంట…. మంత్రిగారి తెలివి తేటలకు వారు నమస్కారం పెట్టేసినట్టే అని టీడీపీ వారు అంటున్నారు.