botsa satyanarayana allegations on tdp leadersరాజధాని విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ అడ్డు ఆపు లేకుండా చెలరేగిపోతున్నారు. తాజగా ఒక కులం వారు, టీడీపీ వారికి అక్కడ భారీగా భూములు ఉన్నాయని, వారి కోసం రాజధాని అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అందులో భాగంగా మొన్నటివరకూ టీడీపీలో ఉండి బీజేపీలో చేరిన సుజనా చౌదరికి 623.12 ఎకరాలు ఉన్నాయని ఆరోపించారు బొత్స. సుజనా చౌదరి తన బినామీలు, సన్నిహితుల పేర్లతో కృష్ణా, గుంటూరు జిల్లాలో కొనుగోలు చేసారని ఆరోపించారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బొత్స ప్రకటించిన భూములలో ఏదీ కూడా రాజధానికి 30 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో లేవు. కొన్ని భూములు అయితే రాజధాని నుండి 80 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల దూరంలో కూడా ఉన్నాయి. వీటిని అన్నిటినీ మంత్రిగారు రాజధాని భూములే అనేస్తున్నారు. వీటిలో కొన్ని భూముల రేట్లు రాజధాని ప్రకటన అనంతరం పడిపోయాయి కూడా. కాకపోతే అంత డీటెయిల్స్ ఎవరికీ తెలుస్తాయి అని మంత్రి గారు మీడియా ముందు లెక్కలు చెప్పేశారు.

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే సుజనా చౌదరి చంద్రబాబు నాయుడుని ముంచి బీజేపీలో చేరిపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మాత్రం ఇంకా ఆయన పట్ల అభద్రతాభావంతోనే ఉన్నారు. ఆయనను టీడీపీ కోవర్టుగానే చూస్తున్నారు. బీజేపీలో ఉంటూ టీడీపీ ఎజెండాను అమలు చేస్తున్నారని, బీజేపీ అధినాయకత్వాన్ని తమపైకి ఉసిగొల్పుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతల అనుమానం. దానితో సుజనాను టార్గెట్ చేస్తున్నారు.