Botsa Satyanarayanaవైఎస్సాఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారి ప్రెస్ మీట్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఆయన లాజిక్ లే వేరు. అటువంటి ప్రెస్ మీటే ఈరోజు జరిగింది. అసలు ఉన్నపళంగా గవర్నర్‌తో భేటీ కావాల్సిన అవసరం చంద్రబాబుకు ఎందుకొచ్చింది? అనే డౌట్ ఆయనకు వచ్చింది.

“కేంద్రంతో దూకుడు వద్దని గవర్నర్‌ సూచించినట్లు టీడీపీనే చెబుతోంది. మరోవైపు తనపై కేంద్రం కేసులు పెట్టాలని చూస్తోందంటూ చంద్రబాబు చెబుతున్నారు. కేసులు పెడితే తిరగబడాలని పైగా ప్రజలను పిలుపునిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ గనుక చంద్రబాబుపై చర్యలు తీసుకోకుంటే టీడీపీ, బీజేపీ పార్టీలు లాలూచీ పడ్డట్లే,” అని బొత్స అభిప్రాయపడ్డారు.

కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ గనుక చంద్రబాబుపై చర్యలు తీసుకోకుంటే టీడీపీ, బీజేపీ పార్టీలు లాలూచీ పడ్డట్లే అని అంటున్నారు సరే, మరి అదే మాట టీడీపీ వాళ్ళు అంటే? దాదాపుగా డజన్ కేసులలో ముద్దాయి అయిన జగన్ పై నాలుగేళ్లలో బీజేపీ ప్రభుత్వం చర్య తీసుకోలేదు అంటే మీ మైనారిటీ ఓట్లకే ప్రమాదమేమో బొత్స గారూ!