Boozing in theatresమహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ రెండు రోజుల క్రితం మద్యం అమ్మకాలు జరిపితే థియేటర్లకు ఎక్కువ మంది ప్రేక్షకులను తీసుకురావచ్చా అని తన ట్విట్టర్ ఫాలోయర్స్ ని అడిగారు. సురేష్ బాబు, రానాతో చర్చలో ఈ ఆలోచన వచ్చిందని ఆయన వెల్లడించారు. ఇది అవాంఛిత సమస్యలను తెచ్చిపెడుతుందని మరియు కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా నిరోధించవచ్చని ప్రతికూల అభిప్రాయం వచ్చింది.

అయితే, ఇది ఏదో అసందర్భంగా వచ్చిన ఆలోచన కాదని, పరిశ్రమలో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని సమాచారం. సురేష్ బాబు కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయితే, కుటుంబ ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి కొన్ని థియేటర్లను ఈ ప్రయోజనం కోసం కేటాయించాలని ఆయన స్పష్టంగా చెప్పారు.

“ఆ సంస్కృతి ఇప్పటికే విదేశాలలో ఉంది. ఇటువంటి చర్య ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా తెస్తుంది. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం వారే” అని సీనియర్ నిర్మాత చెప్పారు. ప్రస్తుతం థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేదాని మీద స్పష్టం లేదు. కనీసం ఆగస్టు వరకూ ఆ అవకాశం లేదని చాలా మంది అభిప్రాయం.

ఈలోగా ఓటీటీల ప్రభావం గురించి కూడా పెద్ద ఎత్తున థియేటర్ల ఓనర్లు భయపడుతున్నారు. అయితే కేవలం సినిమా చూడటమే కాకుండా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఏ విధంగా వినూతనమైన ఎక్సపీరియెన్స్ ని కలిగించాలని వారు ఆలోచన చేస్తున్నారు.