Bonda Uma and Buddha Venkanna were attacked by -YSRCP Leaders-ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లకు ఈరోజు చివరి రోజు కావడంతో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. నామినేషన్లు వెయ్యనివ్వకుండా పలు చోట్ల అభ్యర్థులను ఎటాక్ చేశారు. పలు చోట్ల నామినేషన్ పేపర్లు చించివేశారు. మాచెర్లలో ఏకంగా టీడీపీ రాష్ట్ర స్థాయి నేతల మీద ఎటాక్ చెయ్యడం సంచలనం కలిగించింది.

న్న మాచర్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవడంతో.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశంతో మాచర్లకు బోండా ఉమ, బుద్దా వెంకన్న వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. టీడీపీ నేతలు పర్యటిస్తున్న విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు బైకులపై వెంబడించి కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు.

డ్రైవర్ అప్రమత్తతో వ్యవహరించి కారును వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో బుద్దా వెంకన్న దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. న్యాయవాది కిశోర్ తలకు గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గన్ మెన్ తుపాకీ చూపిస్తే అతనిపై కూడా దాడి చేశారు. దీంతో అతను కూడా పరారయ్యాడని సమాచారం.

ఇదంతా వీడియోలో నిక్షిప్తం కావడంతో అధికార పార్టీ అభాసుపాలు అయ్యింది. రాష్ట్ర స్థాయి నేతలు… అందులో ఒక ఎమ్మెల్సీ మీద ఎటాక్ కు ప్రయత్నం చేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు అని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర వహించడం పరిస్థితికి అద్దం పడుతుంది.