bomb-threat-to-hyderabad metro rail ameerpet-stationరైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపులు రావడం మాములే. అందులో చాలా వరకు అబద్ధపువే అవుతాయి కూడా. అదే క్రమంలో హైదరాబాద్ మెట్రోకు మొదటి బాంబు బెదిరింపు వచ్చింది.అమీర్‌పేట మెట్రో రైల్వేస్టేషన్‌లో బాంబు పెట్టినట్లు ఆదివారం బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని అగంతకుడు మెట్రో అధికారులకు ఫోన్ చేసి ఫ్లాట్ ఫామ్ పై బ్యాగు ఉందని, ఆ బ్యాగులో బాంబులున్నాయంటూ తెలిపాడు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, బాంబు స్క్వాడ్ హుటాహుటిన మెట్రో స్టేషన్ కు చేరుకున్నారు. అతను ఫోన్ చేసి చెప్పిన విధంగానే ఫ్లాట్ ఫామ్ పై బ్యాగు ఉండడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. జాగ్రత్తలు తీసుకుని బ్యాగును పరిశీలించగా అందులో ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

కాగా… బ్యాగు ఎవరిది, ఎవరు పెట్టారన్న దానిపై పోలీసులు ఆరా తీయగా స్టేషన్లో పనిచేస్తున్న ఒక సెక్యూరిటీ బాగ్ అక్కడ పెట్టి మర్చిపోయినట్టు చెప్పడంతో అతనిని మందలించి వదిలిపెట్టారు. మరోవైపు ఒక్క శనివారంలోనే మెట్రో రైల్ లో 2.1 లక్షల మంది ప్రయాణించి కొత్త రికార్డు నెలకొలిపారు.tion