Pawan-Kalyan-sardaar-gabbar-singh-teaserపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్ధార్ గబ్బర్ సింగ్” టీజర్లు ప్రస్తుతం యూ ట్యూబ్ లో సందడి చేస్తున్నాయి. తెలుగు వెర్షన్ కు సంబంధించిన ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్క్ ను దాటి 1 మిలియన్ క్లిక్స్ వైపుకు పరిగెడుతోంది. అలాగే హిందీ టీజర్ పై అభిషేక్ బచ్చన్ వంటి బాలీవుడ్ హీరోలు సైతం ట్వీట్లు చేసి పవన్ కు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పకనే చెబుతున్నారు.

అయితే ఈ రెండు వెర్షన్ల టీజర్లలో పవన్ చేసిన చేష్టలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. హిందీ టీజర్ యాక్షన్ సన్నివేశాలతో కూడుకుని పవన్ లోని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తుండగా, తెలుగు టీజర్లో ఉన్న రెండు, మూడు సన్నివేశాలు మరీ రచ్చ రచ్చ చేస్తున్నాయి. చిన్న పిల్లోడు మాదిరి రోడ్డుపైన బొమ్మ మీద కూర్చుని పవన్ ఊగుతున్న దృశ్యం కోసం అభిమానులు పదే పదే ఈ టీజర్ చూస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు.

దీంతో ప్రస్తుతం బుల్లితెర మీద వీక్షిస్తున్న అభిమాన గణం ఏప్రిల్ 8వ తేదీన ధియేటర్లలో ఇంకెంత రచ్చ చేయాలనే ఆలోచనల్లో మునిగి తేలుతున్నారు. మెగా అభిమానులకు మరింత కిక్ ఇచ్చే న్యూస్ ఏమిటంటే… ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారనే సమాచారం బయటకు పొక్కింది. దీంతో ఏప్రిల్ 8వ తేదీ కంటే ముందు ఈ ఆదివారం నాడు సాయంత్రం మరింత రచ్చకు నోవాటెల్ హోటల్ వేదికగా నిలవడం ఖాయంగా కనపడుతోంది.