Drug Addiction on A Rise After Liquor Ban in Bihar, Andhra Pradesh Beware!సుశాంత్ సింగ్ రాజపుత్ హత్యకేసులోని డ్రగ్స్ యాంగిల్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు చేస్తుంది. ఇందులో భాగంగా బాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, దీపికా పదుకోన్ మరియు శ్రద్ధా కపూర్ ని విచారించి వారి స్టేట్మెంట్లను నమోదు చేసింది డిపార్ట్మెంట్. అయితే ఈ కేసులో కేవలం హీరోయిన్లను మాత్రమే ప్రశ్నించడం పలువురు విమర్శిస్తున్నారు.

“బాలీవుడ్ లో హీరోయిన్లు మాత్రమే డ్రగ్స్ తీసుకుంటున్నారా? హీరోలు ఉత్తములా?,” అంటూ చాలా మంది ఆక్షేపిస్తున్నారు. అయితే అటువంటి విమర్శలకు అవకాశం ఇవ్వకుండా బాలీవుడ్ లో డ్రగ్స్ వాడే హీరోల జాబితా సిద్ధం చేసింది డిపార్ట్మెంట్… రేపో, మాపో బాలీవుడ్ ముగ్గురు ప్రముఖ హీరోలకు సమన్లు జరీ చెయ్యనునట్టు సమాచారం.

ఇప్పటికే విచారించిన హీరోయిన్లలో కొందరిని మళ్లీ విచారణకు పిలచే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎన్సీబీ తొలి జాబితాలో బాలీవుడ్ టాప్ హీరోలు ఉన్నారని వదంతులు వినిపిస్తున్నాయి. విచారణ సందర్భంగా హీరోయిన్ల ఫోన్లు స్వాధీనం చేసుకుంది డిపార్ట్మెంట్… అందులోని మెస్సేజ్లను డీక్రిప్ట్ చేసే పనిలో పడింది.

మరోవైపు… హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఎయిమ్స్ రిపోర్ట్‌ సమర్పించింది. అతడిపై హత్య కాదని, ఉరేసుకోవడం వల్లే చనిపోయాడని రిపోర్టులో వెల్లడించింది. అతడి డీఎన్‌ఏను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నివేదికను సమర్పిస్తున్నామని, దీనిలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని నివేదికలో పేర్కొంది.