bojjala gopala krishna reddy - ke Krishna murthyతెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఇద్దరు రిటైర్ కాబోతున్నారు. మాజీ మంత్రి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి అనారోగ్యం కారణంగా ఈ సారి పోటీ చెయ్యడం లేదు. ఆయన తన కుమారుడు సుధీర్ రెడ్డికి టిక్కెట్టు దక్కించుకునే ప్రయత్నాలలో ఉన్నారు. రిటైర్ కాబోతున్న మరో సీనియర్ నేత ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి కే.ఈ. కృష్ణమూర్తి. వయోభారం వల్ల ఆయన ఈ సారి ఎన్నికలలో పోటీ చెయ్యకూడదని అనుకుంటున్నారు. తన పత్తికొండ నియోజకవర్గం టిక్కెట్టును తన కొడుకు శ్యామ్ కు ఇప్పించుకోవాలని చూస్తున్నారు.

అయితే ఇద్దరి వారసులకు టిక్కెట్లు అనుమానమే అని తెలుస్తుంది. పత్తికొండ సీటు మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరితే ఆయన సతీమణికి ఆ టిక్కెట్టు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా దానికి సుగుమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక బొజ్జల కుమారుడిపై నియోజకవర్గంలో పెద్ద పాజిటివ్ గా లేదని అంటున్నారు. దీనితో ఇద్దరి నేతలు అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు కీలకమైన ఎన్నికలు కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ఫైనల్ చెయ్యడంలో చాలా సీరియస్ గా ఉన్నారు.

టిక్కెట్ల పంపిణీలో ఎటువంటి మొహమాటాలకు పోకూడదని ఆయన భావిస్తున్నారట. అన్ని నియోజకవర్గాలలోనూ బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. దాదాపుగా అందరి అభ్యర్థులను ఈ నెలాఖరుకే ఫైనల్ చెయ్యాలని భావిస్తున్నారు. అభ్యర్థుల మొదటి జాబితా కూడా ఎన్నికల షెడ్యూల్ రాక ముందే ప్రకటిస్తారని సమాచారం. ఎక్కడైతే వివాదాస్పదంగా ఉందొ అక్కడ ముందే ఆశావహులతో మాట్లాడి వారి మధ్య సయోధ్య కుదురుస్తున్నారు.