black-money-holders-clever-than-modiదేశంలోని నల్లకుభేరులకు షాక్ ఇచ్చేందుకు పెద్ద నోట్ల రద్దు విషయాన్ని అమలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని, నల్లకుభేరులు వారికి వరంగా మార్చుకున్నారా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుత పెద్ద నోట్ల రద్దు విషయాన్ని పక్కనపెట్టి, ముందుగా కేంద్రం ప్రకటించిన ఐడీఎస్ పధకం క్రింద దాదాపుగా 65 వేల కోట్లు వెల్లడి అయినట్లుగా మోడీ సర్కార్ ప్రకటించింది. అయితే నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన రుసుమును చెల్లించలేక ఇద్దరు పెద్ద కుభేరులు బొక్కాబోర్లా పడ్డారు.

గుజరాత్ లోని మహేష్ షా అనే వ్యక్తి 13,860 కోట్లు ప్రకటించగా, హైదరాబాద్ కు చెందిన లక్ష్మణరావు అనే వ్యక్తి 10 వేల కోట్లకు పైనే వెల్లడించారు. దీనికి గానూ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తం రుసుమును చెల్లించడంలో ఈ ఇద్దరూ విఫలమయ్యారు. అయితే అసలు విషయం తేలిందేమిటంటే… వీరు అసలు నల్లకుభేరులు కాదని, వీరి వెనుక ఉన్న “అసలు” నల్లకుభేరులు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఐడీఎస్ క్రింద ప్రకటించిన ఈ ఇద్దరి 25 వేల కోట్లు ఎవరివి? ఏమయ్యాయి? అంటే…

ఇవన్నీ పెద్ద నోట్ల మార్పిడిలో భాగంగా ‘బ్లాక్’ కాస్త ‘వైట్’ అయిపోయిందేమో అన్న సందేహాన్ని నిపుణులు వ్యక్తపరుస్తున్నారు. అంటే అప్పటివరకు ఉన్న నల్లధనం కాస్త మోడీ నిర్ణయంతో తెల్లధనంగా మారిపోయిందా? దీంతో అసలు నల్లకుభేరులు సైడ్ కావడంతో, ఈ బినామీ బాబులు బుక్కయ్యరా? వంటి అనుమానాలతో ఐటీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ పరిణామాలతో ప్రధాని కంటే నల్లకుభేరులు అత్యంత తెలివిగా పావులు కదుపుతున్నట్లుగా అర్ధమవుతోంది.