BJP Targeting YS Jagan మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉదంతం ఇంకా రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తుంది. తాజాగా ఆయన ఒక స్టార్ హోటల్ లో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ని కలిసిన ఒక వీడియోని వైఎస్సార్ కాంగ్రెస్ విడుదల చేసింది. వేర్వేరుగా వచ్చి ఒకే రూంలో దాదాపుగా గంటన్నర సేపు వీరు భేటీ అయ్యారు.

రాజ్యాంగ పదవిలో ఉండే వ్యక్తి రాజకీయ సమావేశాలలో పాల్గొనడం అభ్యంతరకరమే అయినా ఆయన ప్రస్తుతం పదవిలో లేరు కాబట్టి లీగల్ గా ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటి ఏమిటంటే…. బీజేపీ అధిష్టానం ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మద్దతు ఇస్తున్నట్టు తేలిపోయింది.

గతంలో ఈ విషయంగా కామినేని మూడు సార్లు హైకోర్టుని ఆశ్రయించారు. అప్పట్లో ఆయన తాను పార్టీ అధిష్టానం నుండి పర్మిషన్ తీసుకునే ఈ పిటిషన్ వేసినట్టు చెప్పారు. ఈ వీడియోతో ఆ విషయం తేటతెల్లం అయ్యింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో భాగంగా ఉంటూనే స్వపక్షంలో విపక్షం అన్నట్టు వ్యవహరించే వారు బీజేపీ వారు.

ఇప్పుడు వారి నెక్స్ట్ టార్గెట్ జగన్ ప్రభుత్వం అన్న విషయం స్పష్టం అయ్యింది. దీనితో జగన్ ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మరోవైపు తనను ఇంకా ఎన్నికల అధికారిగా నియమించనందున నిమ్మగడ్డ హై కోర్టులో ప్రభుత్వం మీద కోర్టు ధిక్కారణ పిటిషన్ వెయ్యబోతున్నట్టు సమాచారం.