chandrababu -naiduమండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఇతర పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల తరువాత వారం రోజులకు జరిగే తిరుపతి ఉపఎన్నికలను కూడా తెలుగుదేశం పార్టీ బహిష్కరిస్తుందని ప్రచారం చేస్తున్నారు.

టీడీపీ అటువంటి నిర్ణయం తీసుకోకపోయినా, ఆ పార్టీ నేతలు తిరుపతిలో ప్రచారం గట్టిగా చేస్తున్నా ఓటర్లను అయోమయానికి గురి చెయ్యడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. వారికి తోడుగా బీజేపీ కూడా చేరింది. టీడీపీ పోటీలో లేదు అని ప్రజల్లోకి తీసుకుని వెళ్లగలిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకే వచ్చే రెండవ స్థానం లోకి వస్తాం అని వారి ఆశ.

ఆ తరువాత టీడీపీ పని అయిపోయిందని ప్రచారం చేసి వైఎస్సార్ కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్న్యాయం అని చెప్పుకుని ఆంధ్రప్రదేశ్ లో ఎదగాలని బీజేపీ వ్యూహంగా కనిపిస్తుంది. దీనిని టీడీపీ ఎలా తిప్పికొడుతోంది అనేది చూడాలి. 2019 ఎన్నికలలో తిరుపతి లోక్ సభ స్థానం లో ఆరో స్థానంతో సరిపెట్టుకున్న బీజేపీ ఈ సారి జనసేన మద్దతుతో గౌరవప్రదమైన ఓట్లు సాధించాలని ఆరాటపడుతుంది.

అలాగే టీడీపీ తీసుకున్న నిర్ణయం తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తుంది. ఏప్రిల్ 17న తిరుపతిలో ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఎస్సి నియోజకవర్గం కావడం, అలాగే ఇటీవలే స్థానిక ఎన్నికలలో ఘన విజయం తరువాత తమ గెలుపు నల్లేరుపై బండినడకే అని వైఎస్సార్ కాంగ్రెస్ అనుకుంటుంది.