BJP Somuverraju - Pawan Kalyan JanaSenaతిరుపతి ఉపఎన్నిక సమీపిస్తుండడంతో బీజేపీ తన సోషల్ మీడియా టీములను సన్నద్ధం చేస్తుంది. ఒక సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. “జనసేన మన మిత్రపక్షం, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ మన రాజకీయ ప్రత్యర్ధులు వారి తప్పుడు విధానాలను, మన పొత్తు గురించి వారి మీడియా ప్రచారం చేసే తప్పుడు సమాచారం ను ఎండ గట్టండి,” అని పిలుపునిచ్చారు.

జనసేన – బీజేపీ పొత్తు గురించి తప్పుడు ప్రచారం చెయ్యడం ఏంటి? అసలు చిచ్చు రేపింది తెలంగాణ బీజేపీ నేత డీకే అరుణ కామెంట్… దానిని కనీసం మిగతా నాయకులు ఖండించకపోవడంతో పవన్ కళ్యాణ్ స్వయంగా మీడియా ముందు తెరాస అభ్యర్థికి ఎమ్మెల్సీ ఎన్నికలలో పరోక్షంగా మద్దతు తెలిపారు.

అక్కడ నుండి ఆ సీటు బీజేపీ ఓడిపోవడంతో బీజేపీ సోషల్ మీడియా మద్దతుదారులు జనసేన పై, పవన్ కళ్యాణ్ పై ముప్పేట దాడి మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ కేసీఆర్ కు అమ్ముడు పోయారు… వకీల్ సాబ్ టిక్కెట్ల రేట్ల పెంపు… స్పెషల్ షోల పర్మిషన్ల కోసం బీజేపీ ముందు సాగిలపడ్డారు సోషల్ మీడియాలో వ్యక్తిగత హననంకు పూనుకున్నారు.

జనసేన-బీజేపీ పై పొత్తు విషయంలో ఇతర పార్టీలను, మీడియాను నిందించే ముందు, జనసేన తో కూర్చుకుని మాట్లాడాలి. అన్నిటికంటే ముందు భాగస్వామికి మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి. ఇది ఇలా ఉండగా… అన్ని ప్రధాన పార్టీలు తిరుపతిలో తమ అభ్యర్థులను ప్రకటించగా ఇంకా బీజేపీ మీనమేషాలు లెక్కిస్తుంది.