Somu Veerraju - Chandrababu Naiduతిరుపతి లో బిజెపి,జనసేన పార్టీలు కలిసి పోటీచేస్తాయని బిజెపి ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఎవరు అభ్యర్ది అయినా రెండు పార్టీలు బలపరుస్తాయని ఆయన అన్నారు. ఇంతవరకు బానే ఉంది. తెలుగుదేశం అనేది 2019 ఎన్నికల తరువాత నుండి లేదని, రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ కు బీజేపీనే ప్రత్యామ్న్యాయమని చెప్పుకొచ్చారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాన్‌ రెసిడెన్షియల్‌ నేతగా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవ చేశారు. అధికారం పోయిన తర్వాత రాష్ట్రాన్ని వదలిపెట్టి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉండడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు కోవిడ్ తరువాత హైదరాబాద్ లో ఉంటున్న మాట నిజమే అయితే ఈ విమర్శ చేసేటప్పుడు సోము వీర్రాజు ఆలోచించాలి కదా.

ఆ పార్టీ కొత్త మిత్రుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఉండేది హైదరాబాద్ లోనే… ఎన్నికల ముందు ఎన్నికల తరువాత కూడా ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నారు. నెలకు ఒక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్ కు రావడం గగనమే. మరి చంద్రబాబు మీద చేసిన విమర్శలు పవన్ కళ్యాణ్ కు కూడా వర్తిస్తాయా? అని టీడీపీ వారు విమర్శిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.. జనసేన అదినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీకి తిరుపతిలో పోటీచేసే అవకాశం ఇవ్వాలంటూ డిల్లీ వెళ్లారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఇప్పటిదాకా బీజేపీ పెద్దలు అప్పోయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. దీనితో జనసైనికులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.