BJP-Penmetsa-Vishnu-Kumar-Rajuసిఎం జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికలలో 175 సీట్లు మనమే గెలవాలని పదేపదే చెప్పడం వెనుక పరమార్ధాన్ని రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు వివరించారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలుచేస్తానని చెప్పిన సిఎం జగన్మోహన్ రెడ్డి అదే మద్యం సొమ్ముతో రాబోయే ఎన్నికలని ఎదుర్కొనేందుకు పెద్ద ప్లాన్ సిద్దం చేశారు. మద్యం అమ్మకాల ద్వారా వస్తున్న నగదుని వైసీపీ నేతలు బ్లాక్ మనీగా పక్కన పెట్టేస్తున్నారు. దేశంలో మరెక్కడా లేనివిదంగా ఏపీలో భారీ స్థాయిలో అనేక మాఫియాలు జరుగుతున్నాయి. ఈ అవినీతి సొమ్ముతోనే రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడానికి వారు సిద్దపడుతున్నారు.

ఒక్కో నియోజకవర్గంలో కనీసం రూ.40 కోట్లు చొప్పున 175 నియోజకవర్గాలలో ఖర్చు పెట్టేందుకు సరిపడా సొమ్ముని వారు సిద్దం చేసుకొంటున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని ప్రతిపక్షాల ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు వైసీపీ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ ఎన్నికలలో ఖర్చు చేయడానికి అవసరమైన డబ్బు సిద్దం చేసుకొంటూ మరోపక్క ప్రతిపక్షాలను ఆర్ధికంగా బలహీనపరిచి ఎన్నికలకి వెళ్ళాలనుకొంటోంది. ఈ ద్విముఖ వ్యూహంతో రాబోయే ఎన్నికలలో 175 సీట్లు గెలుచుకోగలమని నమ్మకంగా చెప్పుకొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైసీపీ నేతల వద్ద చాలా బ్లాక్ మనీ ఉంది. అయినా ఆదాయపన్ను, ఈడీ , సీబీఐ అధికారులు వారిపై దృష్టి పెడుతున్నట్లు లేదు. అలాగే వైసీపీలో నేరాలు చేసి జైలుకెళ్ళిన ఎమ్మెల్సీ అనంత బాబు వంటివారిని కూడా కాపాడుతోంది. కేంద్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని ఓ కంట కనిపెడుతోందని తప్పకుండా తగిన సమయంలో తగిన చర్యలు తీసుకొంటుందని నే భావిస్తున్నాను,” అని అన్నారు.

ఎన్నికలలో ఓటర్లకి డబ్బు వెదజల్లి గెలిచే అవకాశాలు ఉంటాయి కానీ ప్రతీ ఎన్నికలలో అది సాధ్యం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఎన్నికలు జరిగినప్పుడు, మళ్ళీ 2019 ఎన్నికలలో కూడా పార్టీలు భారీగానే డబ్బు పంచిపెట్టాయి. అయితే ఆ రెండు ఎన్నికలలో ప్రజలు ఏకపక్షంగా తీర్పు చెప్పారు. ఒకవేళ డబ్బుతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడం సాధ్యపడితే ఆవిదంగా ఏకపక్ష తీర్పులు వెలువడవు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో సుమారు 50 నుంచి 70 మందిని మార్చక తప్పదని ఐప్యాక్ నివేదికలు ఇస్తోందంటేనే వైసీపీ ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అర్దం అవుతోంది. విష్ణుకుమార్ రాజు చెప్పిన్నట్లు ఒకవేళ 2024 ఏపీ శాసనసభ ఎన్నికలలో వైసీపీ నియోజకవర్గానికి 40 కోట్లు చొప్పున ఖర్చు పెట్టినా, టిడిపి, జనసేనల నుంచి గట్టి పోటీ ఉంటుంది కనుక వైసీపీ 175 సీట్లు గెలుచుకోవడం అసంభవం.