Sunil V Deodhar - Pawan-Kalyanసినీ నటి మాధవీ లత పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలకు జనసేనాని నొచ్చుకున్నారట. ఇటీవలే బర్త్ డే కి విష్ చేసిన వారికి పవన్ రిప్లైలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో కొందరు నార్త్ వాళ్ళకు రిప్లై ఇవ్వడం బాలేదు అంటూ ఆమె ఏదో పోస్టు పెట్టింది. ఆ పోస్టు వైరల్ కావడంతో దాని గురించి టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది.

దేశసమగ్రత కు భంగం కలిగించి, ప్రాంతీయ విద్వేషాలు రేకెత్తించే అటువంటి పోస్టును పదే పదే ప్రసారం చెయ్యడం ఏంటి అంటూ జనసేన అభ్యంతరం తెలుపుతూ టీవీ9కు బహిరంగ లేఖ విడుదల చేశారు. దీనితో జనసైనికులు ట్విట్టర్ లో #ShamelessTV9 అంటూ ట్రెండ్ చేశారు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే సదరు మాధవీ లత గత ఎన్నికలలో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడం.

అయితే ఆ ఎన్నికలలో ఆమె ఓడిపోయింది… డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ మధ్య కాలంలో బీజేపీ జనసేన పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. పవన్ మీద ఆ పార్టీ నేతలు ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ఇప్పుడు ఈ కారణంగా ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా అనేది చూడాలి.

ఎన్నికల తరువాత ఆమె రాజకీయాలలో పెద్దగా యాక్టీవ్ గా లేరు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికే చెందిన ఆమె గతంలో పవన్ కు పెద్ద మద్దతుదారుగా ఉండేవారు. పవన్ ని ఎవరైనా ఏమైనా అంటే పెద్ద ఎత్తున విరుచుకుపడేవారు. ఇప్పుడు ఏమైందో ఏమో తెలీదు.