bjp-mlc-pvn-madhav-says-tdp-going-to-splitఏపీ బీజేపీ నేతలకు రాష్ట్రంలో నాలుగు సీట్లు గెలిచే విధానం తెలియదు గానీ టీడీపీ భవిష్యత్తు మీద ఆలోచనలు ఎక్కువ. ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపి చీలిపోయే అవకాశం ఉందని ఆ పార్టీ శాసనమండలి సభ్యుడు పివిఎస్ మాధవ్ వ్యాఖ్యానించారు. నిజమైన టిడిపి కార్యకర్తలు తిరుగుబాటుకు సిద్దంగా ఉన్నారని ఆయన చెప్పారు. నారావారి పార్టీ, నందమూరి వారి పార్టీగా టీడీపీ చీలనుందన్నారు. రాష్ట్రంలో సైకిల్ టైరులో గాలిలేదని, ఎక్కడ ఉండాలో అక్కడే ఉందని ఆయన అన్నారు.

అసలు ఎన్నికలలో కనీసం ప్రభావం చూపించలేకపోయాం అనే బాధ గానీ సిగ్గు గానీ లేకపోవడం విశేషం. చంద్రబాబుకు రాష్ట్రంలో స్థానం లేదు కాబట్టే జాతీయ స్థాయిలో ఉనికి కోసం చూస్తున్నారని ఎద్దేవా చేశారు.వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయానికి చంద్రబాబే దోహద పడ్డారని, జనసేన పార్టీ చీల్చిన ఓట్లు టీడీపీవేనని ప్రజలు గమనించారన్నారు. ప్రజాశాంతి పార్టీ పేరుతో రాయలసీమలో చంద్రబాబు కుట్రలు చేశారని ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీ నష్టమంటూ జరిగితే అది వైకాపాకు జరుగుతుంది.

దానికి బీజేపీ వారికి బాధ ఎందుకు? వైఎస్సార్ కాంగ్రెస్ గెలిచింది అని బాధ పడేవారు ఎన్డీయే కు మెజారిటీ తగ్గినా ఆ పార్టీ మద్దతు తీసుకోము అని చెప్పగలరా? దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీచినా రాష్ట్రంలో కనీసం 10 చోట్లు కూడా డిపాజిట్ దక్కదు. పక్క పార్టీల మీద పెట్టే ఇంట్రెస్టు కనీసం సొంత పార్టీ మీద పెడితే నాలుగు సీట్లు వస్తాయి. ఇంతకూ ఈ కామెంట్లు చేసే మాధవ్ గతంలో పొత్తులో భాగంగా టీడీపీ బీజేపీకి ఇచ్చిన ఎమ్మెల్సీ సీటు నుండి టీడీపీ ఓట్లతో గెలిచిన వారే.