bjp member kavuri sambasiva raoప్రస్తుతం రాజకీయ నేతల బండారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నటువంటి కావూరి సాంబశివరావు పేరు చేరింది. కావూరికి చెందిన ‘ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్’ సంస్థ 18 బ్యాంకులకు సంబంధించి 1000 కోట్లు మేర శఠగోపం పెట్టారని తెలుస్తోంది. నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించక పోవడంతో, సదరు బ్యాంకులకు చెందిన ప్రతినిధులు ఆఫీస్ ముందర ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ అబిడ్స్ లో ఉన్న సదరు కంపెనీ ఎదుట బ్యాంకు ప్రతినిధులు నిరసనలో భాగంగా ‘మౌన పోరాటం’ చేసారు. రుణాలు చెల్లించి తమ బ్యాంకులు దివాలా తీయకుండా కాపాడాలని ప్ల కార్డులు పట్టుకుని డిమాండ్ చేసారు. ఈ సంఘటనతో అవాక్కయిన కావూరి, మీడియా ప్రతినిధుల కంట పడకుండా జారుకున్నారు. ఏపీ, తెలంగాణా రాష్ట్రాలలో వరుసగా రాజకీయ నేతల “గుట్టు” రట్టు కావడం… ఆహ్వనించదగ్గ పరిణామమే అయినా… ఇన్నాళ్ళూ వారంతా ఏ స్థాయిలో ప్రజలను మోసం చేసారో అన్న విషయం అర్థమవుతోంది. అలాగే, ఆయా నేతల వ్యవహార శైలికి అద్దం పడుతుంది.