NArendra Modi - Chandrababu Naidu-హోరాహోరీ అనుకున్న కర్ణాటక ఎన్నికల ఫలితం తేలిపోయింది. కాంగ్రెస్ అనుకున్న వారిని, హంగ్ అని జోస్యం చెప్పిన వారిని నిరాశపరుస్తూ బీజేపీ క్లియర్ మెజారిటీ వైపుగా అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ కు ఉన్న ఒకేఒక్క పెద్ద రాష్ట్రాన్ని లాక్కుని 2019 ముందు పెద్ద దెబ్బే కొట్టారు మోడీ – అమిత్ షా ద్వయం.

అయితే కర్ణాటక లెక్క అక్కడితో పూర్తి కాబోదు. కర్ణాటకలో తమను ఓడించడానికి ప్రయత్నించిన ఒక నాటి తమ మిత్రుడిపై ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నారు కమలనాధులు. అమిత్ షా పై తిరుమలలో జరిగిన రాళ్ళ దాడితో అది మరింత ఎక్కువయ్యింది. ఇప్పటికే మే 15 తరువాత తామేంటో చూపిస్తామని బీజేపీ నాయకులు బాహాటంగానే ప్రకటిస్తూ వచ్చారు.

చంద్రబాబుకూడా దీనికి తయారయ్యే ఉన్నారు. కర్ణాటక ఎన్నికల తరువాత తన మీద తన వారి మీద కేంద్రం దాడులు ఉంటాయి అని ఆయన ఇప్పటికే ప్రజలకు సంకేతాలు ఇచ్చారు. అయితే ఆ దాడి ఎటువైపు నుండి ఎలా వస్తుందో చూడాలి. మరోవైపు చంద్రబాబుకు రానున్న కొత్త తలపోట్లు తలుచుకుని ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు వైకాపా వారు.