bjp leader suggest ys jagan to watch bheemla nayakఅసలే నిధుల కొరతతో రాష్ట్రాన్ని ఎలా నెట్టుకురావాలోనని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అప్పులు చేస్తూ తిప్పలు పడుతుంటే, బీజేపీ నేతలు మాత్రం సీఎంకు మరింత మంటెక్కించే వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలను ఎదుర్కొంటూనే “భీమ్లా నాయక్” ఘనవిజయం సాధించిన నేపధ్యంలో, ఈ సినిమాను అడ్డం పెట్టుకుని బీజేపీ నేత జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

“విజయవాడలో పవన్ కళ్యాణ్ గారు నటించిన భీమ్లా నాయక్ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూశాను. సినిమా సక్సెస్‌ను అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించిన వైసీపీ సర్కార్‌కు భారీ విజయం షాకిస్తోంది. రాజకీయాలు పక్కన పెట్టి భీమ్లా నాయక్‌ని చూడమని వైఎస్ జగన్ గారికి సూచన. యు విల్ లవ్ యిట్ సీఎం గారు!” అంటూ టీజ్ చేస్తూ ట్వీట్ చేసారు జీవీఎల్ నరసింహారావు.

సినిమాలోని కొన్ని డైలాగ్స్ మరియు సన్నివేశాలు వైసీపీకి కౌంటర్ డైలాగ్స్ అంటూ ఓ పక్కన అసలే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సందడి చేస్తుంటే, ఇపుడు వారికి తోడయ్యేలా రాష్ట్ర బీజేపీ నేత కూడా సెటైర్లు వేస్తూ “భీమ్లా నాయక్” సినిమాను చూడమని స్వయంగా సీఎంకే చెప్పడం ఖచ్చితంగా జగన్ కు మంటెక్కించే వ్యాఖ్యలే అనేది ఫ్యాన్స్ మాట.

‘భీమ్లా నాయక్’ సినిమాను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. అయితే అంతిమంగా ఏపీలో లాభాల బాట పడుతుందా? లేక ఇంత సక్సెస్ లోనూ టికెట్ ధరల వలన నష్టాల బాట పడుతోందా? అన్నది తేలడానికి మరో వారం రోజుల సమయం పడుతుంది.

ఇంతకీ జీవీఎల్ చెప్పినట్లుగా సీఎం జగన్ ‘భీమ్లా నాయక్’ సినిమాను చూడాలంటారా? లేక ఇప్పటికే చూసేసారంటారా? ఇద్దరు నాని మంత్రులను సినిమా చూడమనే పంపించారంటూ ఫస్ట్ డే కూడా సోషల్ మీడియాలో జగన్ పై కామెంట్స్ హల్చల్ చేసాయి. అంతలా సినిమాలో వైఎస్ జగన్ కు సంబంధించిన అంశాలు నిజంగానే ఏమైనా ఉన్నాయా?