Did-Telugu-Voters-Alter-the-Fate-of-BJP-in-Karnatakaవినోదం కోసం సినిమా ధియేటర్ కు వెళ్ళిన ప్రేక్షకుడికి ముందుగా వినిపించేది జాతీయ గీతం. మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉన్నా… జాతీయ గీతంపై ఉన్న అభిమానం, ప్రేమతో తప్పనిసరిగా ఆ రెండు నిముషాల పాటు నిల్చోవడం సగటు భారతీయులుగా అందరూ చేస్తున్న పని. అయితే ఇది కేవలం ప్రజలకు మాత్రమే, ప్రజలను పాలించే రాజకీయ నేతలకు మాత్రం ఈ జాతీయ గీతంతో పెద్దగా పనేమీ లేదన్నట్లుగా కనపడుతోంది.

అధికారమే పోయిన తర్వాత అసెంబ్లీలో వినిపించే జాతీయ గీతంతో పనేముంది అనుకున్నారో ఏమో గానీ, బిజెపి నేతల వ్యవహారాన్ని రాహుల్ గాంధీ తూర్పారబట్టారు. ఇప్పటికే ‘సెటిల్మెంట్’ వ్యవహారాల ఆడియో టేప్ లతో ప్రజల దృష్టిలో దోషులుగా ముద్రించబడిన బిజెపి నేతల వ్యవహారం విమర్శలకు దారివ్వగా, తాజాగా అసెంబ్లీలో అనుసరించిన విధానంతో దేశంపై, దేశ గీతంపై కేంద్ర ప్రభుత్వ పాలకుల దృష్టి అవగతం అవుతోంది.

సినిమా ధియేటర్లలో అయితే సుప్రీంకోర్టు నిబంధనల దృష్ట్యా… జాతీయ గీతాన్ని ప్రదర్శించడం, దానికి గౌరవం అందించడం జరుగుతున్నాయి. బహుశా ఇలాంటి నిబంధనలు అసెంబ్లీలో పాటించాలని సుప్రీంకోర్టు సరైన విధివిధానాలను ఇవ్వలేదని భావించారో ఏమో గానీ బిజెపి నేతలకు జాతీయ గీతంతో పని లేకుండా పోయింది. యడ్యూరప్ప రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం, ఆ పైన అధికారం పోయిందని వెంటనే వెనుతిరగడంతో బిజెపి నేతల తంతు పూర్తయ్యింది.